ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా కొనసాగుతున్న రామ్ చరణ్( Ram Charan ) వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్న విషయం మనందరికీ తెలిసిందే… రామ్ చరణ్ దర్శక ధీరుడు రాజమౌళి( Rajamouli ) తీసిన ఆర్ ఆర్ ఆర్ సినిమాతో తనలోని వైవిధ్యమైన నటుడుని బయటకి తీసి దేశం మొత్తం ఫ్యాన్స్ ని సంపాదించుకున్నాడు.
ఇక సినిమా విషయం పక్కన పెడితే ఈ మధ్య బాలయ్య అన్ స్టాపబుల్ షో ( Balayya unstoppable show )సెకండ్ సీజన్ లో ప్రభాస్ వచ్చినప్పుడు బాలయ్య రామ్ చరణ్ కి కాల్ చేస్తే ప్రభాస్ గురించి ఇంట్రస్టింగ్ విషయాలు చెప్పి ప్రభాస్( Prabhas ) ని కంగారు పెట్టి ఆడియన్స్ కి ఫుల్ ఫన్ అందించాడు.
అలాగే బాలయ్య నువ్వు ఎప్పుడు మా షోకి వస్తావ్ చరణ్ అని అడిగితే మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాను అని చెప్పాడు.అయితే రీసెంట్ గా తెలుస్తున్న విషయం ఏంటంటే బాలయ్య అన్ స్టాపబుల్ షో సీజన్ 3 మొదటి ఎపిసోడ్ కి రామ్ చరణ్ తో పాటు, రామ్ చరణ్ బెస్ట్ ఫ్రెండ్ అయినా కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) రప్పించే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తుంది…

రామ్ చరణ్, కేటీఆర్( Ram Charan, KTR )ల స్నేహం గురించి అందరికీ తెలిసిందే.మామూలుగానే కేటీఆర్‌కు ఇండస్ట్రీతో మంచి సంబంధాలున్నాయి.అందులోనూ రామ్ చరణ్‌తో అయితే ఎన్నో ఏళ్లుగా మంచి అనుబంధం ఉంది.
వీరి బంధాన్ని ఇది వరకు ఎన్నో వేదికల మీద చూశాం.కానీ ఇప్పుడు ఆ బంధాన్ని బాలయ్య అన్ స్టాపబుల్ షోలో చూడబోతోన్నాం…

ఇప్పటికే సెకండ్ సీజన్ లో ప్రభాస్,పవన్ కళ్యాణ్( Prabhas and Pawan Kalyan ) ఇద్దరు వచ్చి ఈ సీజన్ కియాంచి బుస్టాప్ ఇచ్చారు…ఇక దాంతో సీజన్ 3 రామ్ చరణ్ తో స్టార్ట్ చేసి మళ్ళీ ఎన్టీయార్ తో ఎండ్ చేసే ప్లాన్ లో ఆహ బృందం ఉన్నట్టు తెలుస్తుంది…అందుకే ఇప్పటి నుంచే ఈ షోకి సంభందించిన అన్ని కర్యక్రమలు దగ్గరుండి మరీ అల్లు అరవింద్ చూసుకుంటున్నారు తెలుస్తుంది…
.







