టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ఈడీ దూకుడు పెంచింది.విచారణలో భాగంగా ఇద్దరు నిందితుల వాంగ్మూలం సేకరించనుంది.
ఈ మేరకు నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ ను విచారించడానికి ఈడీ అధికారులకు నాంపల్లి కోర్టు అనుమతిని ఇచ్చింది.ఇందులో భాగంగా మరికాసేపటిలో ఈడీ అధికారులు చంచల్ గూడ జైలుకు వెళ్లనున్నారు.
ఇవాళ, రేపు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించనున్నారు.నిందితుల వాంగ్మూలంను అధికారులు నమోదు చేయనున్నారు.







