ఇంతకుమించి ఇంకేం అడగను... ఉపాసన పోస్ట్ వైరల్!

మెగా కోడలు ఉపాసన (Upasana ) ప్రస్తుతం ప్రెగ్నెంట్ అనే విషయం మనకు తెలిసిందే.మరి కొద్ది రోజులలో ఈమె తల్లి కాబోతున్న నేపథ్యంలో ఉపాసనకు సంబంధించిన ఈ విషయమైనా క్షణాల్లో వైరల్ అవుతుంది.

 I Dont Ask For Anything More Than That Upasanas Post Is Viral , Upasana, Ramchar-TeluguStop.com

గత కొద్దిరోజులుగా దుబాయ్, మాల్దీవ్స్ వెకేషన్ అంటూ ఎంజాయ్ చేసిన ఈ దంపతులు తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు.ఉపాసన ప్రెగ్నెంట్ అయిన సమయం నుంచి తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.

ఈ క్రమంలోనే దుబాయిలో తనుకు ఎంతో ఘనంగా సీమంతం( Baby Shower ) జరిగిన విషయం మనకు తెలిసిందే.ఇలా అన్ని విషయాలను అభిమానులతో పంచుకొనే ఉపాసన సండే స్పెషల్ అంటూ ఒక వీడియోని షేర్ చేశారు.ఈ వీడియోలో చిరంజీవి తల్లి అంజనదేవి (Anjana Devi) స్వయంగా ఉపాసన కోసం ప్రత్యేకంగా పులావ్ తయారు చేశారు.ఈ క్రమంలోనే అంజనాదేవి తనకోసం ప్రేమగా పులావ్ చేయడంతో ఉపాసన ఈ వీడియోని షేర్ చేస్తూ… నాయనమ్మ ప్రేమతో చేసిన పులావ్ ఇంతకన్నా ఇంకేం అడగాలి అంటూ ఈ వీడియోని షేర్ చేశారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అపోలో హాస్పిటల్ చైర్ పర్సన్ గా బాధ్యతలు నిర్వహించడమే కాకుండా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను చేస్తూ ఎంతో మంచి గుర్తింపు పొందారు.ఇక సోషల్ మీడియాలో కూడా ఉపాసనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం మనకు తెలిసిందే.

ఇక పెళ్లి తర్వాత ఈ దంపతులు పది సంవత్సరాలకు తల్లిదండ్రులు కానున్న నేపథ్యంలో బుల్లి మెగా వారసుడు లేదా వారసురాలి కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.ఇక రామ్ చరణ్ (Ramcharan) ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ప్రస్తుతం ఈయన రాంచరణ్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ (Game Changer) నటిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube