ఏపీలో బీసీలకు వైసీపీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు.ఈ మేరకు బీసీలకు న్యాయంపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.
కల్లు గీత కార్మికులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తుందని నారా లోకేశ్ ఆరోపించారు.బీసీ సంక్షేమ హాస్టళ్లలో దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయని విమర్శించారు.
టీడీపీతోనే బీసీలకు రాజకీయ, ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చిందన్నారు.బీసీ కార్పొరేషన్ ను జగన్ నిర్వీర్యం చేశారని ఆరోపించారు.
బీసీలకు అణచివేసేందుకు జగన్ అనేక కుట్రలు చేశారని మండిపడ్డారు.