పవన్ నెక్స్ట్ లైనప్ కు త్రివిక్రమ్ తో సంభంధం ఏంటంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా పలు క్రేజీ ప్రాజెక్టులు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఎప్పుడు లేని విధంగా ఈసారి వరుస సినిమాలు అనౌన్స్ చేస్తూ పవర్ స్టార్ తన ఫ్యాన్స్ కు ట్రీట్ పెంచుకుంటూ పోతున్నాడు.

 Pawan Kalyan Film With Sudheer Varma Is Locked Details, Ustaad Bhagat Singh, Har-TeluguStop.com

మరి మొన్నటి వరకు అనౌన్స్ చేయడమే కానీ పూర్తి చేయడు అని అనుకున్నారు.అయితే అందరి అంచనాలను తల్లక్రిందులు చేస్తూ ఈయన లైనప్ లో ఉన్న ఒక్కో సినిమాను పూర్తి చేసుకుంటూ వస్తున్నాడు.

ఇటీవలే పవర్ స్టార్ వినోదయం సీతం రీమేక్ ను పూర్తి చేసాడు.ఈ షూట్ పూర్తి అవ్వగానే ఎక్కువ గ్యాప్ లేకుండానే నెక్స్ట్ హరీష్ శంకర్ సినిమాను స్టార్ట్ చేసాడు.

హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) సినిమాను ప్రకటించిన విషయం విదితమే.ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి అయినట్టు కూడా వార్తలు వస్తున్నాయి.

మరి ఇది పూర్తి చేయడమే ఆలస్యం మరో సినిమా సెట్స్ లో అడుగు పెట్టాడు.

Telugu Harish Shankar, Og, Pawan Kalyan, Pawankalyan, Sudheer Varma, Ustaadbhaga

సుజీత్ దర్శకత్వంలో ఓజీ సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది.ఈ సినిమా నుండి నిన్న అఫిషియల్ గా ఒక వీడియోను రిలీజ్ చేసారు దీంతో ఈ సినిమా ముంబైలో షూట్ స్టార్ట్ చేసుకున్నట్టు తెలుస్తుంది.మరి ఇలా ఒకదాని తర్వాత మరొక సినిమాను పూర్తి చేస్తుండడంతో ఫ్యాన్స్ కు ఎగ్జైటింగ్ గా ఉన్నారు.

ఇక ఇప్పుడు పవర్ స్టార్ లైనప్ లో మరో డైరెక్టర్ పేరు చేరిపోయింది.

Telugu Harish Shankar, Og, Pawan Kalyan, Pawankalyan, Sudheer Varma, Ustaadbhaga

యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ (Sudheer Varma) దర్శకత్వంలో కూడా పవన్ సినిమా చేయబోతున్నట్టు బజ్ వినిపిస్తుంది.ఈ డైరెక్టర్ ఈ సినిమా ఉంది అని కన్ఫర్మ్ కూడా చేసారు.మరి తాజాగా ఈ సినిమా నుండి ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

ఈ సినిమా సెప్టెంబర్ లో అనౌన్స్ మెంట్ అవ్వనుందని.ఈ సినిమాకు మూల కథను త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) అందిస్తుండగా.సుధీర్ వర్మ డెవలప్ చేసి డైరెక్ట్ చేస్తాడని టాక్.ఇక ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ స్థాయిలో నిర్మిస్తారట.

చూడాలి ఈ సినిమా ఎప్పటికి స్టార్ట్ అవుతుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube