కోలీవుడ్ హీరోల్లో అద్బుతమైన ఫాలోయింగ్ ఉన్న హీరో సూర్య( Suriya ).ఈయనకు తమిళ్ లో మాత్రమే కాదు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది.
ఈయన నటించిన వరుస సినిమాలు ఇక్కడ కూడా రిలీజ్ అయ్యి మంచి హిట్ అందుకుంటున్నాయి.అందుకే ఈయన సినిమాల కోసం తమిళ్ ప్రేక్షకులతో పాటు తెలుగు ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తూనే ఉంటారు.

ఈ మధ్య కాలంలో సూర్య నటిస్తున్న అన్ని సినిమాలు రిలీజ్ అయ్యి మంచి విజయాలు సాధిస్తున్నాయి.మరి ప్రస్తుతం సూర్య నటిస్తున్న సినిమాల్లో ఆయన 42వ ( Suriya 42 ) సినిమా కూడా ఉంది.ఈ సినిమా కోలీవుడ్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.డైరెక్టర్ శివ ( Director Siruthai Siva )దర్శకత్వంలో గ్రాండ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి ఈ రోజు మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు.
గత కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా టైటిల్ రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.మరి చెప్పినట్టుగానే ఏప్రిల్ 16న అంటే కొద్దిసేపటి క్రితం ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసారు.
ఒకటి కాదు ఈ సినిమా నుండి రెండు బిగ్గెస్ట్ అనౌన్స్ మెంట్స్ వచ్చాయి.

ఈ సినిమాకు మేకర్స్ ఇంట్రెస్టింగ్ టైటిల్ ను రివీల్ చేసారు.”కంగువ” ( Kanguva ) అనే అద్భుతమైన టైటిల్ ను మోషన్ పోస్టర్ వీడియోతో రివీల్ చేసారు.అంతేకాదు ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా ఎర్లీ 2024న రిలీజ్ చేస్తున్నట్టు చెప్పి ఫ్యాన్స్ కు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు.
ఈ వీడియో దేవిశ్రీ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ తో మంచి నిర్మాణ విలువలతో గ్రాండ్ గా కనిపిస్తుంది.చూడాలి ఈ సినిమా కోలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందో లేదో.
ఇదిలా ఉండగా ఈ సినిమాలో సూర్యకు జోడీగా దిశా పటానీ ( Disha Patani ) హీరోయిన్ గా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.గ్రీన్ స్టూడియోస్ వారు, యువీ క్రియేషన్స్ వారు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
ఈ సినిమా దాదాపు 10 భాషల్లో రిలీజ్ కానున్నట్టు వార్తలు వస్తున్నాయి.మరి సూర్య ఈ సినిమాతో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో వేచి చూడాల్సిందే.







