16వ సీజన్ ఐపిఎల్ టోర్నీలో RCB వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్( RCB vs DC ) మధ్య శనివారం మ్యాచ్ జరిగింది.ఈ మ్యాచ్ లో RCB పై ఢిల్లీ క్యాపిటల్స్ 23 పరుగుల తేడాతో గెలవడం జరిగింది.
ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ సాక్షిగా మరోసారి గంగూలీ… విరాట్ కోహ్లీ మధ్య విభేదాలు బయటపడ్డాయి.గతంలో బీసీసీఐ అధ్యక్షుడుగా గంగూలీ ( Ganguly ) ఉన్న సమయంలో… కోహ్లీతో( Virat Kohli ) కోల్డ్ వార్ సాగినట్లు వార్తలు రావడం జరిగింది.
అయితే శనివారం ఎం.చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీం మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో… ఢిల్లీ క్యాపిటల్స్ కి డైరెక్టర్ గా సౌరవ్ గంగూలీ ఉన్న నేపథ్యంలో…ఆర్‌సీబీ స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్ బౌలింగ్ లో డీసీ ప్లేయర్ అమన్ హకీమ్ భారీ షాట్ ఆడబోయి అవుట్ అయ్యాడు.

సరిగ్గా బౌండరీ వద్ద కోహ్లీ చేతికి చిక్కటం జరిగింది.ఈ క్రమంలో ఢిల్లీ టీం డగౌట్ వద్ద కూర్చున్న గంగూలీ వైపు చూస్తూ.కోహ్లి ఓ సీరియస్ లుక్ ఇచ్చాడు.సౌరవ్ గంగూలీ సైతం.తన వైపు చూస్తున్న కోహ్లీ వైపు ఆ రీతిగానే లుక్ ఇచ్చాడు.ఇక మ్యాచ్ అనంతరం షేక్ హ్యాండ్ ఇచ్చుకునే సమయంలో కోహ్లీ ఎదురైన క్రమంలో.
సౌరవ్ గంగూలీ. షేక్ హ్యాండ్ ఇవ్వకుండానే పక్కకెళ్ళిపోయాడు.
ఈ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతూ ఉంది.ఎంతైనా కోపంలో దాదా నీ మించినవారు లేరు అని నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.







