టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు గుప్పించారు.సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు అనకుండా కోడికత్తి కేసు ఏంటని ప్రశ్నించారు.
హత్యాయత్నం జరిగింది కానీ.కుట్ర లేదని ఎన్ఐఏ చెప్తోందని పేర్ని నాని ఆరోపించారు.
ప్రభావితం కాకపోతే ఈ విధమైన చార్జ్ షీట్ ఎందుకు వస్తుందని ప్రశ్నించారు.కేసు క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
విచారణాధికారులు దిగజారిపోతున్నారని విమర్శించారు.చంద్రబాబుకి ఎక్కడికక్కడ స్లీపర్ సెల్స్ పని చేస్తున్నారని మండిపడ్డారు.
ఆ స్లీపర్ సెల్స్ ఎన్ఐఏ, సీబీఐని మ్యానేజ్ చేస్తుంటారన్నారు.నిందితుడు శ్రీనివాస్ ను టీడీపీ నేతలు ఏదో చేయబోతున్నారని అనుమానంగా ఉందని వెల్లడించారు.







