పరువు కోసం కొడుకునే హత్య చేసిన తండ్రి.. ఇంతకి ఆ కొడుకు ఏం చేశాడంటే..?

ఇటీవల కాలంలో జరుగుతున్న దారుణాలను గమనిస్తే సమాజం ఎటు వెళ్తుందో అస్సలు అర్థం కావడం లేదు.కుటుంబ సభ్యులే దారుణ హత్యలకు పాల్పడుతున్నారు.

 The Father Who Killed His Son For Honor What Did That Son Do , Krishnagiri, Subh-TeluguStop.com

పిల్లలు ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం వల్ల పరువు పోతుందని కడుపున పుట్టిన సొంత పిల్లలనే కాటికి పంపిస్తున్నారు కొందరు తల్లిదండ్రులు.పిల్లల మనసుల్ని అర్థం చేసుకోకుండా కులాల వివక్ష చూపిస్తూ దారుణ హత్యలకు పాల్పడుతున్నారు.

ఈ కోవకు చెందిన పరువు హత్య సంఘటన తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లాలో తీవ్ర కలకలం రేపింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం క్రిష్ణగిరి జిల్లాలోని( Krishnagiri ) ఉత్తంగరి సమీపంలో ఉండే అరుణగిరి గ్రామంలో దండపాణి కుటుంబం ( Dandapani family )నివసిస్తోంది.

దండపాణి యొక్క కుమారుడు సుభాష్, అనుష్క ( Subhash, Anushka )అనే అమ్మాయిని ప్రేమించాడు.తన ప్రేమ విషయం సుభాష్ తల్లిదండ్రులతో చెప్పగా.

అనుష్క తక్కువ కులానికి చెందిన యువతి కావడంతో తల్లిదండ్రులు అంగీకరించలేదు.దీంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయిన సుభాష్ ప్రేమ పెళ్లి చేసుకొని తల్లిదండ్రులకు దూరంగా కాపురం పెట్టేశాడు.

ఈ విషయం దండపాణికు తెలియడంతో తమ పరువు మొత్తం పోయిందని కొడుకు, కోడలిపై కోపం పెంచుకొని వారిని చంపాలని నిర్ణయించుకున్నాడు.రాత్రి సమయంలో అందరూ నిద్రలో ఉండగా దండపాణి కొడుకు ఇంటికి వెళ్ళాడు.

తనతో పాటు తెచ్చుకున్న కత్తితో కొడుకు సుభాష్, కోడలు అనుష్క పై దండపాణి దాడి చేశాడు.

Telugu Anushka, Dandapani, Kannamal, Krishnagiri, Latest Telugu, Subhash-Latest

సుభాష్ కు బలంగా కత్తి గుచ్చుకోవడంతో తీవ్ర గాయం అయ్యి మరణించాడు.కానీ కోడలిపై దాడి చేస్తున్న సమయంలో ఇంట్లోనే ఉన్న అత్త కన్నమ్మల్ ( Kannamal )అడ్డుపడడంతో, ఆమెపై కూడా కత్తితో దాడి చేసి హత్య చేశాడు.ఇంతలో కోడలు అనుష్క తీవ్ర గాయాలతోనే ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీసి చెట్ల పొదల మధ్యలో దాక్కుంది.

కోడలిని చంపేందుకు వెంబడిస్తున్న దండపాణి నీ చుట్టుపక్కల వారు చితకబాది పోలీసులకు అప్పగించారు.పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి రెండు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube