యంగ్ టైగర్ ఎన్టీఆర్( Jr ntr ) హిందీ సినిమా లో నటించబోతున్నాడు అనే విషయం కన్ఫర్మ్ అయింది.ప్రస్తుతం చేస్తున్న కొరటాల శివ ఎన్టీఆర్30 సినిమా పూర్తి అయిన తర్వాత వెంటనే హిందీ సినిమా షూటింగ్ లో జాయిన్ కాబోతున్నాడు.
హృతిక్ రోషన్ హీరో గా నటిస్తున్న వార్ 2( Wara 2 ) సినిమా లో ఎన్టీఆర్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.మొదట ఆ పాత్ర కోసం ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్( Allu arjun ) ని సంప్రదించారని ప్రచారం జరుగుతుంది.

పుష్ప చిత్రం తో హిందీ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న అల్లు అర్జున్ కి మొదట ఆ పాత్రని ఆఫర్ చేశారట, కానీ అల్లు అర్జున్ బిజీ షెడ్యూల్ కారణంగా డేట్లు ఇచ్చే పరిస్థితి లేదు.అందుకే ఆ పాత్ర కి ఎన్టీఆర్ ని సంప్రదించారని ప్రచారం జరుగుతుంది.పాన్ ఇండియా సినిమాల కోసం వెయిట్ చేస్తున్న ఎన్టీఆర్ కి హిందీ లో ఒక మంచి ఎంట్రీ గా ఈ సినిమా నిలుస్తుంది అనే ఉద్దేశం తో ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.

వార్ సీక్వెల్ అనగానే ఎన్టీఆర్ ఓకే చెప్పినట్లుగా సమాచారం అందుతుంది.అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఎన్టీఆర్ పాత్ర ఆ సినిమా లో ఉంటుందని కూడా ప్రచారం జరుగుతుంది.ఒకవేళ ఎన్టీఆర్ సినిమా హిందీ లో నిరాశ పర్చినా కూడా సౌత్ లో కచ్చితంగా మంచి కలెక్షన్స్ నమోదు చేసే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం సినిమా కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని ఇదే ఏడాది ద్వితీయార్థం లో కచ్చితంగా సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.మరో వైపు ఎన్టీఆర్ తెలుగు లో కూడా వరుసగా సినిమాలకు కమిట్ అవుతున్నాడు.ఒక వైపు హిందీ సినిమాలు మరో వైపు తెలుగు సినిమాలతో ఎన్టీఆర్ రాబోయే నాలుగైదు సంవత్సరాల్లో బిజీ బిజీగా ఉండబోతున్నాడు.







