అమెరికాలో కాల్పుల ఘటనలకు తుపాకులు కారణం కాదు : ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

అగ్రరాజ్యం అమెరికాలో( America ) గన్ కల్చర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.నగదు, నగలు కోసం హత్యలు చేసేవారు కొందరైతే.

 Guns Not Reason For Us Shootings Donald Trump , Donald Trump, America, Gun Lobb-TeluguStop.com

జాతి, వర్ణ వివక్షలతో ఉన్మాదులుగా మారేవారు మరికొందరు.ఏది ఏమైనా అక్కడ గన్ కల్చర్ వల్ల ఏటా వేలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు.

దీనికి చెక్ పెట్టాలని ప్రభుత్వాలు కృషి చేస్తున్నా.శక్తివంతమైన గన్ లాబీ ( Gun Lobby )ఈ ప్రయత్నాలను అడ్డుకుంటోందన్న వాదనలు వున్నాయి.

ఇక తుపాకీ కాల్పుల్లో భారతీయులు కూడా పెద్ద సంఖ్యలో మరణిస్తున్నారు.

Telugu America, Donald Trump, Gun Lobby, National Rifle-Telugu NRI

ఈ క్రమంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) తుపాకీ కాల్పుల ఘటనలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇండియానాలోని ఇండియానాపోలిస్‌లో జరిగిన నేషనల్ రైఫిల్ అసోసియేషన్( National Rifle Association ) (ఎన్ఆర్ఏ) వార్షిక సమావేశంలో ట్రంప్ పాల్గొని ప్రసంగించారు.సామూహిక కాల్పుల ఘటనలకు తుపాకీలే ఒక్కటే కారణం కాదన్నారు.

దీనికి మానసిక సమస్యలు, డ్రగ్స్ వినియోగం, నేర ప్రవృత్తే కారణమని ట్రంప్ అన్నారు.

Telugu America, Donald Trump, Gun Lobby, National Rifle-Telugu NRI

నాష్‌విల్లేలోని క్రిస్టియన్ ఎలిమెంటరీ స్కూల్‌పై( Christian Elementary School in Nashville ) జరిగిన దాడి ఘటనతో మన హృదయాలు ముక్కలయ్యాయని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు.ఆ కిల్లర్‌ను అత్యంత వేగంగా పట్టుకుని.గర్వకారణంగా నిలిచిన లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులను హీరోలుగా అభివర్ణించారు ట్రంప్.2000 సంవత్సరం వరకు అమెరికాలో పాఠశాలల్లో కాల్పుల ఘటనల గురించి ఎప్పుడూ మాట్లాడలేదని ట్రంప్ గుర్తుచేశారు.ఇదో మానసిక ఆరోగ్య సమస్య, సామాజిక సమస్యల, సాంస్కృతిక సమస్యగా ఆయన అభివర్ణించారు.

తాను మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికైతే.ఇప్పటికే వున్న తుపాకీ చట్టాలను , ఆయుధాలపై శిక్షణ ఇచ్చే వారిని ఉపసంహరించుకుంటానని హామీ ఇచ్చారు ట్రంప్.

అంతేకాకుండా దేశంలోని ప్రతి పాఠశాల ఎంట్రన్స్ వద్దా సెక్యూరిటీ గార్డ్‌లను వుంచుతానని తెలిపారు.ఇదిలావుండగా.

గత నెలలలో కాలిఫోర్నియా రాష్ట్రం శాక్రమెంటో కౌంటీ బ్రాడ్ షా రోడ్డులోని ఓ గురుద్వారాలో కాల్పుల ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube