శాకుంతలం సినిమాలో సమంత కంటే అర్హ 100 రెట్లు బెటర్.. సూట్ కాలేదంటూ?

స్టార్ హీరోయిన్ సమంత( Samantha) నటించిన శాకుంతలం సినిమా( Sakunthalam movie ) అత్యంత భారీ అంచనాలతో థియేటర్లలో విడుదలైంది.గుణశేఖర్( Gunasekhar ) డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత కావడంతో ఈ సినిమా కచ్చితంగా అంచనాలను అందుకుంటుందని అందరూ భావించారు.

 Neizens Comments About Samantha Acting In Shakuntalam Details Here , Samantha-TeluguStop.com

అయితే విచిత్రంగా ఈ సినిమాకు యునానిమస్ నెగిటివ్ టాక్ వచ్చింది.సమంత నటన విషయంలో, లుక్స్ విషయంలో ప్రధానంగా నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి.

శాకుంతలం సినిమాలో సమంత శకుంతలలా కాకుండా సమంతలానే కనిపించిందని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.ఆ పాత్రకు సమంత సూట్ కాలేదని రాజసం చూపించే విషయంలో ఆమె ఫెయిల్ అయ్యారని అభిప్రాయాలు వినిపించాయి. దేవ్ మోహన్( Dev Mohan ) నటన బాగానే ఉన్నా ప్రేక్షకులకు సుపరిచితమైన నటుడు నటించి ఉంటే మాత్రం ఈ సినిమా రేంజ్ మారిపోయేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు అల్లు అర్హ( Allu Arha ) నటనకు మాత్రం నెటిజన్లు ఫిదా అవుతున్నారు.స్క్రీన్ పై అర్హ కనిపించేది తక్కువ సమయమే అయినా భరతుని పాత్రకు అర్హ ప్రాణం పోశారు.ముద్దుముద్దు మాటలతో దేవ్ మోహన్ కు ధీటుగా అర్హ పలికించిన సంభాషణలు హైలెట్ గా నిలిచాయి.

శాకుంతలం సినిమా విషయానికి వస్తే సమంత కంటే అర్హ 100 రెట్లు బెటర్ అని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

ఈ కామెంట్ల విషయంలో సమంత ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.సమంత ఖుషి సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి రావడంతో పాటు బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ఈ ఏడాది సెకండాఫ్ లో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

శకుంతల పాత్రకు సామ్ సూట్ కాలేదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.సమంత సిటాడెల్ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తుండగా ఈ వెబ్ సిరీస్ లో ఆమె బోల్డ్ గా కనిపించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube