నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో అర్థరాత్రి డ్రోన్ కలకలం చెలరేగింది.శ్రీశైలం ఆలయంలో డ్రోన్ చక్కర్లు కొట్టింది.
గుర్తించిన ఆలయ అధికారులు డ్రోన్ ఎగురవేసిన వారి కోసం గాలిస్తున్నారు.అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆలయ అధికారుల నిర్లక్ష్యం వలనే ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ నేపథ్యంలో డ్రోన్ ఎగురవేసిన వారిని పట్టుకునేందుకు ఆలయ సిబ్బందితో పాటు పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.







