రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది.ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా డీసీసీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.
ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను దేశంలో అన్ని వర్గాల ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ఆయా ప్రాంతాలలో జరుపుకుంటున్నటువంటి ఈ వేడుకలు చాలా సంతోషకరమైనవని అన్నారు.
స్వాతంత్ర ఉద్యమంతో పాటు భారతదేశం లో ఒక నిర్మాణాత్మకమైనటువంటి గట్టాని అన్ని రంగాల వారికి, అన్ని వర్గాల ప్రజలకు సమానత్వాన్ని కలిగించే విధంగా భారత రాజ్యాంగాన్ని నిర్మించి జాతికి అంకితం చేసినటువంటి వారి ఆలోచన విధానాన్ని ఈ తరానికి చెందిన ప్రజలందరికీ ఈ ఉత్సవాల ద్వారా తెలియజేసే విధంగా ప్రతి ఒక్కరూ పాల్గొనడం సంతోషకరమన్నారు.
ఆయన ఆలోచన విధానాన్ని అందరూ కూడా అందిపుచ్చుకొని వారి ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.