రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో డా.బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు నాగసముద్రాల సంతోష్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ రూపకర్త, స్వతంత్ర భారత తొలి న్యాయ శాఖ మంత్రి, భారతరత్న డా.బి.ఆర్.అంబేడ్కర్ భారత రాజ్యాంగాన్ని రచించిన కమిటీకి నాయకత్వం వహించిన ఘనత ఆయన కి సొంతమన్నారు.బడుగు బలహీన వర్గ ప్రజలను సామాజికంగా, ఆర్థికంగా సమానంగా చూడాలని రాజ్యాంగాన్ని రూపొందించడంతో నేటికీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే దేశం నడుస్తోందన్నారు.

కులవ్యవస్థ నిర్ములానకు చేసిన మహనీయుడి కృషి ఎనలేనిదని కొనియాడారు.అంబెడ్కర్ జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకమని,యువతకు మార్గదర్శి ఆయన అడుగుజాడల్లో అందరూ నడవాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధికార ప్రతినిధి కొత్త శ్రీనివాస్ రెడ్డి , దళిత మోర్చా మండల అధ్యక్షుడు ఎలుక రామస్వామి ,దళిత మోర్చా మండల ఉపాధ్యక్షుడు మామిడి శేఖర్ , మండల ఉపాధ్యక్షుడు పున్ని సంపత్ ,శక్తి కేంద్రం ఇంఛార్జి దేశెట్టి శ్రీనివాస్ ,పట్టణ అధ్యక్షుడు తిప్పారపు శ్రవణ్ , మహిళ మోర్చా నాయకురాలు కొలనూరు ముత్తక్క ,సీనియర్ నాయకులు బత్తిని సాయి గౌడ్,మ్యాకల మల్లేశం , పోతరాజు పర్శరాం, ఒరగంటి తిరుపతి, ఎగుర్ల బీరయ్య తో పాటు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.







