తెలుగు సినీ ప్రేక్షకులకు నటి మాధవి లత ( Maadhavi Latha )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమె సినిమాల ద్వారా కంటే రాజకీయాల ద్వారానే బాగా పాపులారిటీ సంపాదించుకుందని చెప్పవచ్చు.
మొదట తనిష్ హీరోగా నటించిన నచ్చావులే( Nachavule ) సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది.

ఆ తర్వాత స్నేహితుడా సినిమాలో నటించి ప్రేక్షకులకు మరింత చేరువ అయింది.ఆ తర్వాత కొన్ని సినిమాలలో నటించిన మాధవి లత సినిమాలకు విరామం ఇచ్చి రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈమె మరింత పాపులారిటీ సంపాదించుకుంది.

అలా రాజకీయ నాయకురాలుగా సినీ నటిగా భారీగా పాపులారిటీని సంపాదించుకుంది మాధవి లత.ఇది ఇలా ఉండే తాజాగా మాధవీలత చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత తనకు ఎదురైన ఒక చేదు అనుభవం గురించి వెల్లడించింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒక నిర్మాత నైట్ కి వస్తావా అని నేరుగా అడిగారు అని ఆమె తెలిపింది.
తనకు ఎవరినీ బాధ పెట్టాలని ఉండదని,కానీ సహనం కోల్పోతే మాత్రం మాటలు అనేస్తాను చెప్పుకొచ్చింది.

కాస్టింగ్ కౌచ్( Casting couch ) విషయం గురించి మాట్లాడుతూ.ఒక ప్రొడ్యూసర్ నాతో తప్పుగా మాట్లాడితే నేను మీరు అనుకున్న వ్యక్తిని కాదండి అని నెమ్మదిగా కూల్ గా సమాధానం ఇచ్చాను.ఒక్కరోజు నైట్ కి వస్తావా అని అడిగిన వాళ్లు ఆ తర్వాత నన్ను అమ్మ అని పిలిచారు అని చెప్పుకొచ్చింది మాధవి లత.సినిమా ఇండస్ట్రీలో మనం ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించాలి.సాఫ్ట్‌గా మన పని చేసుకుని బయటకు వచ్చేయాలి అని ఆమె చెప్పుకొచ్చింది.
అలాగే తాను ప్రస్తుతం మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్నట్లు తెలిపింది.







