Junior NTR : అయ్య బాబోయ్.. ఎన్టీఆర్ చేతి వాచ్ ఖరీదు ఏకంగా అన్ని రూ.కోట్లా?

ఇటీవల కాలంలో స్టార్ హీరో హీరోయిన్లు ఎక్కడ కనిపించినా కూడా ముందుగా వారు ధరించే వస్తువులు, డ్రెస్ లు వాళ్లు ప్రయాణించే కార్ లు ఎక్కువగా హైలెట్ అవుతున్నాయి.ముఖ్యంగా స్టార్ హీరోలు ధరించే వాచ్ లు, షూస్, షూట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

 Young Tiger Ntr Watch Price Shock Everyone-TeluguStop.com

కోట్ల రూపాయల ఖరీదైన వస్తువులను ధరించి హీరోలు సైతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో అలా ఖరీదైన వాటిని ధరించి ఎక్కువగా సోషల్ మీడియాలో ఇద్దరు హీరోలు నిలుస్తున్నారు.

వారు ఒకరు రామ్ చరణ్ కాగా మరొకరు జూనియర్ ఎన్టీఆర్.

</ కాగా మొన్నటికి మొన్న రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్( Jr ntr ) లో ఆస్కార్ అవార్డు ప్రధాన కార్యక్రమంలో భాగంగా ఈ ఇద్దరు హీరోలు వేసుకున్న షూస్ వాచ్ లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన విషయం తెలిసిందే.అంతేకాకుండా కోట్ల రూపాయల విలువ చేసే వాటిని ధరించడంతో అభిమానులు వాటి ధర తెలిసి షాక్ అయ్యారు.ఇది ఇలా ఉంటే తాజాగా హీరో జూనియర్ ఎన్టీఆర్ మరోసారి వార్తల్లో నిలిచారు.

ఇదివరకే ఎన్టీఆర్ ధరించే వాచ్ ల విషయంలో పలు సార్లు సోషల్ మీడియాలో నిలిచిన విషయం తెలిసిందే.తాజాగా కూడా అమెజాన్ స్టూడియోస్ వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ ఫారెల్ ఎన్టీఆర్ ఇంట్లో అరేంజ్ చేసిన పార్టీకి హాజరైన విషయం తెలిసిందే.

</ అందుకు సంబంధించిన ఫోటోలను ఎన్టీఆర్ సోషల్ మీడియాలో షేర్ చేయగా అందులో జూనియర్ ఎన్టీఆర్ ధరించిన బ్లాక్ కలర్ వాచ్ పై అందరూ దృష్టి పడింది.చూడడానికి ఎంతో సింపుల్గా కనిపిస్తున్నప్పటికీ ఆ వాచ్ ధర( Watch cost ) తెలిస్తే దిమ్మతిరగాల్సిందే.ఆ వాచ్ ధర అక్షరాల దాదాపు 8 కోట్ల రూపాయలు పైగా ఉంటుందని తెలుస్తోంది.

</ ప్రపంచంలో ఉన్న మోస్ట్ కాస్ట్లీ వాచ్ లలో రిచర్డ్ మిల్లే బ్రాండ్ టాప్ ప్లేస్ లో ఉంటుందని చెప్పవచ్చు.ఈ బ్రాండ్ కి సంబంధించిన వాచ్ లు మినిమం కోటి రూపాయల నుంచి ఉంటాయని చెప్పవచ్చు.సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది సెలబ్రిటీలు మాత్రమే ఈ వాచ్ లను ఉపయోగిస్తారు.

అందులో తారక్ కూడా ఒకరు.తారక్ చేతికి కనిపిస్తున్న ఆ సింపుల్ వాచ్ దర తెలిసి చాలామంది షాక్ అవుతున్నారు.

వామ్మో అంత చిన్న వాచ్ ఏకంగా అన్ని కోట్ల అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube