Sai Dharam Tej : లవ్ స్టోరీ గురించి స్పందించిన సాయి ధరమ్ తేజ్.. బ్రేకప్ కూడా అయిందంటూ?

టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్‌ తేజ్‌ ( sai dharam tej )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మెగా మేనల్లుడుగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సాయి ధరమ్‌ తేజ్‌ టాలీవుడ్ లో పలు సినిమాలలో నటించి హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు.

 Sai Dharam Tej Opens About His Break And Marriage Matter-TeluguStop.com

ఇది ఇలా ఉంటే ఆ మధ్య ఒకసారి సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ కి గురైన విషయం తెలిసిందే.ఆ ప్రమాదం నుంచి కోలుకోవడానికి దాదాపు ఆరు నెలల సమయం పట్టింది.

ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత సాయి ధరమ్‌ తేజ్‌ నటించిన తాజా చిత్రం విరూపాక్ష( Virupaksha ).

అంతేకాకుండా ప్రమాదం తర్వాత సాయి ధరమ్‌ తేజ్‌ నటించిన మొదటి సినిమా కూడా ఇదే కావడం విశేషం.ఈ సినిమా ఏప్రిల్ 21వ తేదీన విడుదల కానున్న విషయం తెలిసిందే.ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా గడుపుతున్నారు.

ఈ ప్రమోషన్స్ లో భాగంగానే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి తన లవ్ స్టోరీ ( love story )గురించి చెప్పుకొచ్చాడు.ఈ సందర్భంగా సాయి ధరమ్‌ తేజ్‌ మాట్లాడుతూ.

ఎవరు అంటున్నారు చెప్తున్నారు కదా అని నేను పెళ్లి చేసుకోను.నాకు నచ్చినప్పుడే పెళ్లి చేసుకుంటాను.

అలాగే నా లవ్ స్టోరీ విషయానికి వస్తే నేను ఒక అమ్మాయిని గతంలో ప్రేమించాను.కానీ కొన్ని కారణాల వల్ల బ్రేకప్ అయ్యింది.బ్రేకప్ తర్వాత సైలెంట్ అయిపోయాను.అమ్మాయిలు అంటేనే భయమేస్తుంది అని చెప్పుకొచ్చారు సాయి ధరమ్ తేజ్.కాగా గతంలో చాలా సార్లు సాయి ధరమ్‌ తేజ్‌ పెళ్లి వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.

ఆ వార్తలన్నీ కూడా వట్టి రూమర్స్ అని కొట్టి పరేశారు సాయి.ఇక ఇంటర్వ్యూలో భాగంగా సాయిధరమ్ తేజ్ తన లవ్ స్టోరీ గురించి చేసిన వాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కాగా విరూపాక్ష సినిమా విషయానికి వస్తే.

కార్తీక్ దండు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube