నంద్యాల జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంకు భక్తుల రద్దీ పెరుగుతోంది.భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరుతున్నారు.
ఈ నేపథ్యంలో శ్రీశైల మల్లన్న ఆర్జిత సేవకు డిమాండ్ పెరిగింది.
ఈ క్రమంలో పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది.
ఇకపై స్వామివారి ఆర్జిత సేవా టికెట్లను ఆన్లైన్లో విక్రయించనుంది.మే 1 వ తేదీ నుంచి ఆర్జిత సేవతో పాటు స్వామివారి స్పర్శ దర్శనానికి ఆన్లైన్ టికెట్ తప్పనిసరి చేసింది.
ఈ మేరకు ఈనెల 25వ తేదీ నుంచి ఆన్లైన్ టికెట్ల బుకింగ్ భక్తులకు అందుబాటులోకి రానుంది.