స్టార్ డైరెక్టర్ రాజమౌళి( Rajamouli ) ప్రతిభ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.రాజమౌళి టాలెంట్ కు ఎంత పారితోషికం ఇచ్చినా తక్కువేనని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా జక్కన్న మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుని ఫ్యాన్స్ కు మరింత దగ్గర కావడం గమనార్హం.టైమ్ మీడియా సంస్థ ప్రకటించిన వరల్డ్ మోస్ట్ 100 ఇన్ ప్లూయెన్సర్( World Most 100 in Pluencer ) జాబితాలో రాజమౌళి కూడా ఉన్నారు.
పయోనీర్స్ కేటగిరీలో జక్కన్నకు ఈ అరుదైన గౌరవం దక్కడంతో ఆయన అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.రాజమౌళి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకున్నారు.ఇతర విదేశీ భాషల్లో సైతం రాజమౌళికి డిమాండ్ అంతకంతకూ పెరుగుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.మహేష్ జక్కన్న కాంబో మూవి షూట్ మొదలుకాకుండానే ఊహించని స్థాయిలో ఈ సినిమాకు ఆఫర్లు వస్తున్నాయి.
ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కావడానికి కచ్చితంగా మరో మూడేళ్ల సమయం పడుతుందని అప్పటివరకు అభిమానులకు ఎదురుచూపులు అయితే తప్పవని సమాచారం అందుతోంది.టైమ్ 100లో ఉండటం జక్కన్న లాంటి ఎంతో ప్రతిభ ఉన్న వ్యక్తులకు సాధారణ విషయం అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.రాజమౌళి ఈ సినిమా తర్వాత ప్రభాస్ ( Prabhas )తో ఒక సినిమా తీస్తారని తెలుస్తోంది.
మహాభారతం సినిమా( Mahabharatam movie ) తర్వాత జక్కన్న సినిమాలకు గుడ్ బై చెప్పనుండగా ప్రస్తుతం పౌరాణిక సినిమాలకు ఆదరణ తగ్గుతున్న నేపథ్యంలో రాజమౌళి ప్లాన్ ఏ విధంగా ఉంటుందో చూడాల్సి ఉంది.జక్కన్న మరిన్ని భారీ సినిమాలపై దృష్టి పెట్టి సంచలన విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.రాజమౌళికి తన కుటుంబం నుంచి లభిస్తున్న సపోర్ట్ వల్ల కూడా ఈ స్థాయిలో విజయాలు దక్కుతున్నాయని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ రావడం రాజమౌళికి కెరీర్ పరంగా ప్లస్ అయింది.