ఎవరూ ఏ పని చేసిన జనాల దృష్టంతా సినిమా స్టార్స్ పైనే ఉంటుంది.వాళ్ళని చూడడం కోసం నానా కష్టాలు పడుతుంటారు.
ఎన్టీఆర్, ఏఎన్నార్ తరంలో ఇద్దరే స్టార్ హీరోలు ఉండేవారు…వీళ్ళ తర్వాత కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు లాంటి హీరోలు ఉండేవారు… కానీ ఇప్పుడు మాత్రం చాలామంది స్టార్ హీరోలు( Star Heroes ) పుట్టుకొస్తున్నారు… ఒకరిని మించి మరోకరి సినిమాలు ఆడుతున్నాయి.అప్పట్లో లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకుంటే…ఇప్పుడు వందల కోట్లు తీసుకుంటున్నారు.
ఆ రేంజ్‌కు టాలీవుడ్ ఎదిగిపోయింది.అయితే ఇప్పుడు టాలీవుడ్ లో ఏ హీరోలు ఎక్కువగా డబ్బులు ఉన్నవారో తెలుసుకుందాం…
ఇందులో ముందుగా చెప్పుకోవాల్సింది నాగార్జున ( Nagarjuna ) గురించి వారసత్వం గా వచ్చిన అస్తి ఉన్నప్పటికీ దానిమీద డిపెండ్ కాకుండా తన సొంతంగా చాలా ఆస్తులు సంపాదించుకున్నాడు.
నాగార్జున సినిమాలతో పాటు బిజినెస్ లు కూడా చేస్తాడు హీరో గానే కాకుండా నాగార్జున నీ మంచి బిజినెస్ మేన్ అని కూడా చెప్పచ్చు.వాళ్ళ నాన్న ఇచ్చిన అన్నపూర్ణ స్టూడియో( Annapurna Studios ) బిజినెస్ లు మొత్తం కలిపితే నాగార్జున ఆస్తులు రూ.12వేల కోట్ల దాకా ఉన్నట్టు సమాచారం.

ఇక తర్వాత చెప్పుకోవాల్సింది చిరంజీవి ( Chiranjeevi ) గురించి.మెగాస్టార్ గా తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవి అప్పట్లో ఇండస్ట్రీలో అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే వారు.అప్పట్లో ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న హీరోగా రికార్డు సృష్టించారు.
ఆయన దాదాపు 150కు పైగా సినిమాల్లో నటించారు.వాటితో పాటు ఎన్నో వ్యాపారాలు చేస్తున్నారు.రియల్ ఎస్టేట్ లో ఎక్కువగా పెట్టుబడులు పెట్టారు…

ఆయన ఆస్తులు దాదాపు రూ.8వేల కోట్ల దాకా ఉన్నాయి.మూడో స్థానంలో వెంకటేశ్ ఉన్నాడు.రామానాయుడు ఆస్తులతో పాటు వెంకటేశ్ కూడా సినిమాలు, వ్యాపారాలతో చాలానే సంపాదిస్తున్నాడు.ఆయన ఆస్తుల విలువ దాదాపు 6 వేల కోట్ల వరకు ఉంటుందని తెలుస్తుంది…
.







