అన్ స్టాపబుల్ షో తర్వాత ఆ స్థాయిలో కాకపోయినా ప్రేక్షకుల్లో అంతోఇంతో గుర్తింపును సంపాదించుకున్న షోలలో నిజం విత్ స్మిత షో( Nijam with Smita ) కూడా ఒకటి.ఈ షోలో రాధిక, సుప్రియ, స్వప్నదత్(Supriya ) పాల్గొనగా సుప్రియ మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ షూటింగ్ సమయంలో నాలుగుసార్లు సెట్ నుంచి పారిపోయానని ఆమె చెప్పుకొచ్చారు.ఆ సమయంలో పవన్ నాతో ఈ సినిమా షూట్ కచ్చితంగా పూర్తి చేయాలని చెప్పారని సుప్రియ అన్నారు.

రాధిక మాట్లాడుతూ(Radhika ) నా కంటే అందంగా ఉన్నవాళ్లు, నా కంటే బాగా నటించేవాళ్లు ఉన్నారని ఆమె చెప్పుకొచ్చారు.ఇది కచ్చితంగా విధిరాతే అని రాధిక కామెంట్లు చేశారు.నిర్మాత స్వప్నాదత్ మాట్లాడుతూ తాను చిన్న వయస్సులోనే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చానని ఆమె తెలిపారు.తన సినీ కెరీర్ లో ఎన్నో ఆటుపోట్లు ఎదురయ్యాయని స్వప్నాదత్ ఆమె చెప్పుకొచ్చారు.
ఈ నెల 14వ తేదీన ఫుల్ ఎపిసోడ్ ప్రసారం కానుంది.

ఈ ప్రోమోకు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. సుప్రియ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉండగా అక్కినేని స్టూడియోస్ బాధ్యతలను చూసుకుంటున్నారు.సుప్రియకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
సుప్రియ రెండో పెళ్లికి సంబంధించి వార్తలు వైరల్ అవుతుండగా ఆ వార్తలకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది.

సుప్రియ కెరీర్ పరంగా మరింత ఎదగడంతో పాటు మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.కెరీర్ పరంగా తప్పటడుగులు పడకుండా సుప్రియ జాగ్రత్తగా అడుగులు వేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.సుప్రియ కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉంటుందో చూడాల్సి ఉంది.
నాగార్జున నుంచి సుప్రియకు ఎంతో సపోర్ట్ ఉంది.సుప్రియ నటిగా కెరీర్ ను కొనసాగించి ఉంటే ఆమె మరింత సక్సెస్ అయ్యేవారని చెప్పవచ్చు.







