దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ నటి కుష్బూ ( Actress Kushboo ) అందరికీ సుపరిచితమే ప్రస్తుతం ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉండడమే కాకుండా మరోవైపు రాజకీయాలతో కూడా ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా సినిమాలు రాజకీయాలు అంటూ బిజీగా గడుపుతున్న కుష్బూ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు.
ఇలా సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

ఈ క్రమంలోనే ఇండస్ట్రీలోకి బాలనటిగా అడుగుపెట్టిన కుష్బూ అనంతరం 1991 వ సంవత్సరంలో నటుడు ప్రభు( Actor Prabhu )తో కలసి చిన్న తంబి( chinna Thambi movie ) అనే సినిమాలో నటించి హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.ఈ సినిమా అప్పట్లో ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.ఇక ఈ సినిమా విడుదల అయ్యే 32 సంవత్సరాలు కావడంతో ఈ విషయాన్ని ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు.

ఈ సందర్భంగా కుష్బూ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ… చిన్న తంబి సినిమా చేసి అప్పుడే 32 సంవత్సరాలు గడిచిపోయింది అంటే నమ్మలేకపోతున్నాను.మీరు నాపై చూపించిన ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటాను.వాసు ( Vasu )ప్రభు( Prabhu ) వీరి కోసం ఎప్పుడూ నా గుండె కొట్టుకుంటూనే ఉంటుంది.ఈ సినిమాకి హృదయాలను కదిలించే అద్భుతమైన సంగీతం అందించిన ఇళయరాజా గారికి బాలు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
నందిని ప్రతి ఒక్కరి హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయిందని,ఇంత ప్రేమ చూపించిన మీ అందరికీ మరోసారి కృతజ్ఞతలు అంటూ ఈ సందర్భంగా కుష్బూ ఈ సినిమా విడుదలై 32 సంవత్సరాలు అయిన సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు.ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.







