గాడ్ ఫాదర్ ( Godfather), వాల్తేరు వీరయ్య ( Waltair Veerayya ) వంటి రెండు సక్సెస్ లను అందుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi ).సెకండ్ ఇన్నింగ్స్ లో అదిరిపోయే సక్సెస్ రేట్ తో దూసుకు పోతున్న చిరు మధ్యలో ఆచార్య మినహా అన్ని సినిమాలు హిట్ అయ్యాయి.
ఇక వాల్తేరు వీరయ్య సంక్రాంతికి రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ సాధించింది.ఈ సినిమా ఇచ్చిన జోష్ తో మెగాస్టార్ ఇప్పుడు ”భోళా శంకర్” ( Bhola Shankar ) సినిమా చేస్తున్నాడు.

తమిళ్ సూపర్ హిట్ సినిమా వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మెహర్ రమేష్ ( Meher Ramesh ) డైరెక్ట్ చేస్తుండగా.అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.ఇక ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.కీర్తి సురేష్ చిరు చెల్లెలుగా నటిస్తుంది.మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు.

రీమేక్ సినిమా అయినా కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.మెహర్ రమేష్ సాలిడ్ మాస్ అండ్ ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా భాగం పూర్తి అయ్యింది.
మరి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూట్ ఇంకా నెల బ్యాలెన్స్ ఉందట.ఈ సినిమా సమ్మర్ రిలీజ్ వాయిదా పడింది.

దీంతో కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఇప్పుడు మళ్ళీ షూటింగ్ ను స్టార్ట్ చేస్తున్నట్టు సమాచారం.మరి ఇంకా నెల షూటింగ్ ( Bhola Shankar Shoot ) బ్యాలెన్స్ ఉండడంతో ఎప్పుడు మొదలు పెడతారో వేచి చూడాలి.ఇక ఈ సినిమాలో అక్కినేని యువ హీరో సుశాంత్ కూడా కీలక రోల్ పోషిస్తున్నాడు.మరి ఈ సినిమాను ఆగస్టు 11న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఇంకా సమయం చాలానే ఉండడంతో ఎప్పుడు షూట్ ఫినిష్ చేస్తారో చూడాలి.







