నాచురల్ స్టార్ నాని తాజాగా దసరా సినిమా( Dasara Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.శ్రీకాంత్ ఓదెలా( Sreekanth Odela ) అనే నూతన దర్శకుడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
నాని ( Nani ) ఇప్పటివరకు నటించిన సినిమాలలో అత్యధిక కలెక్షన్లో రాబట్టిన సినిమాగా దసరా సినిమా రికార్డు సృష్టించింది.ఈ సినిమా ఏకంగా 100 కోట్ల క్లబ్ లో చేరి నానికి అతిపెద్ద విజయాన్ని అందించింది.
ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో దానికి పలు నిర్మాణ సంస్థల నుంచి ఇప్పటికే పెద్ద ఎత్తున ఆఫర్లు వెళ్లవెత్తుతున్నాయని తెలుస్తుంది.
సాధారణంగా ఒక హీరో నటించిన సినిమా మంచి హిట్ అవుతే తన తదుపరి సినిమాలకు రెమ్యూనరేషన్( Nani Remuneration ) పెంచడం సర్వసాధారణం.ఈ క్రమంలోనే నాని సైతం దసరా సినిమా మంచి సక్సెస్ అవడంతో తన తదుపరి సినిమాలకు భారీగా రెమ్యూనరేషన్ పెంచారని తెలుస్తోంది.దసరా సినిమాకు 20 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్న నాని తన తదుపరి సినిమాకు రెండు కోట్ల రూపాయలను రెమ్యూనరేషన్ పెంచుతూ తన తదుపరి సినిమాకి 22 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేశారని తెలుస్తుంది.
ఇక నానితో సినిమా చేస్తే మినిమం హిట్ గ్యారెంటీ అనే నమ్మకం నిర్మాతలలో ఉండడంతో ఈయన అడిగిన మొత్తంలో రెమ్యూనరేషన్ ఇవ్వడానికి కూడా నిర్మాతలు వెనకడుగు వేయడం లేదని తెలుస్తోంది.ఇక దసరా సినిమా సక్సెస్ అవ్వడంతో నానికి వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నప్పటికీ ఈయన మాత్రం ఆచితూచి కథలను ఎంపిక చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.దసరా సినిమా తర్వాత నాని తన తదుపరి చిత్రాన్ని వైరా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమాలో నానికి జోడిగా మృణాల్ ఠాకూర్( Mrunal Thakur ) నటిస్తున్నారు.
ఈ సినిమాకి మరొక నూతన దర్శకుడు పని చేయనున్నారు.