చమురు ఉత్పత్తి తగ్గించనున్న ఒపెక్ దేశాలు.. దీని పర్యవసానాలివే

ప్రపంచ చమురు ఉత్పత్తిలో మూడింట ఒక వంతు వాటాను కలిగి ఉన్న ఒపెక్ దేశాలు( OPEC Countries ) కీలక నిర్ణయం తీసుకున్నాయి.మే 2023 నుంచి చమురు ఉత్పత్తిని ఈ దేశాలు తగ్గించనున్నాయి.

 Opec Countries Announces Surprise Cuts In Oil Production Details, Opec Countries-TeluguStop.com

చమురు మార్కెట్ల స్థిరత్వానికి తోడ్పడే లక్ష్యంతో ముందుజాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒపెక్ దేశాలు పేర్కొన్నాయి.ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనం, అమెరికాలో బ్యాంకింగ్ సంక్షోభం కారణంగా ముడి చమురు ధరలపై ప్రభావం తగ్గించేందుకు ఉత్పత్తిని తగ్గిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం ముడి చమురు బ్యారెల్ ధర $67-68 ఉంది.ఇది త్వరలో పెరిగే అవకాశం ఉన్నట్లు విశ్లేసకులు అంచనా వేస్తున్నారు.

మార్చి 2022లో ముడి చమురు బ్యారెల్‌ ధర గరిష్టంగా 139 డాలర్లకు చేరుకుంది.

Telugu America, Consequence, Crude Oil, Oil, Fuel, Benchmark, Latest, Opec, Russ

క్రూడ్ ఆయిల్( Crude Oil ) ఎగుమతి, ఉత్పత్తి తగ్గిస్తామని ఒపెక్, రష్యా దేశాలు ప్రకటించిన తర్వాత, గ్లోబల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ 5 శాతం కంటే ఎక్కువ పెరిగి బ్యారెల్‌ ధర 84.13 డాలర్లకు చేరుకుంది, ఇది గత 10-11 నెలల్లో అత్యధిక రీతిలో ధర పెరుగుదలగా నిపుణులు పేర్కొంటున్నారు.మార్చిలో అమెరికాలోని సిలికాన్ వ్యాలీ బ్యాంక్( Silicon Valley Bank ) దివాళా తీసిన తర్వాత ముడి చమురు ధరలు బ్యారెల్ ధర 67 డాలర్లకు పడిపోయింది.

తాజాగా ఉత్పత్తిని తగ్గించాలని ఒపెక్ దేశాలు భావించడంతో డిసెంబర్ 2023- మార్చి 2024 నాటికి ముడి చమురు ధర బ్యారెల్‌కు 95 నుంచి 100 డాలర్లకు పెరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Telugu America, Consequence, Crude Oil, Oil, Fuel, Benchmark, Latest, Opec, Russ

ఒపెక్ దేశాలు తీసుకున్న నిర్ణయం వల్ల చాలా పరిణామాలు జరగనున్నాయి.ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ద్రవ్యోల్బణ ఒత్తిడి మరింత తీవ్రమవుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.భారతదేశానికి, ఇది అధిక చమురు దిగుమతి భారంగా మారుతుందని అభిప్రాయపడుతున్నారు.

ప్రభుత్వం రోజువారీ రిటైల్ ఆటో ఇంధన ధరల సవరణ యంత్రాంగాన్ని పునఃప్రారంభిస్తే ఇది ద్రవ్యోల్బణాన్ని పెంచుతుందని ఆందోళన వ్యక్తం అవుతోంది.త్వరలో చమురు ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని, ఫలితంగా నిత్యావసరాలు, ఇతర వస్తువుల ధరలు పెరుగుతాయని అంచనాలు ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube