ఫ్లాప్ పడ్డా... టైగర్ నాగేశ్వరరావు ప్రీ రిలీజ్ బిజినెస్ తగ్గట్లేదుగా!

మాస్ మహారాజా రవితేజ( Ravi Teja ) ధమాకా చిత్రం తో ప్రేక్షకుల ముందుకు వచ్చి వంద కోట్ల కలెక్షన్స్ నమోదు చేసిన విషయం తెలిసిందే.ఆ సినిమా మాస్ ఆడియన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా మెప్పించింది.

 Ravi Teja Tiger Nageswararao Pre Release Business , Ravi Teja, Tiger Nageswarara-TeluguStop.com

ఆ సినిమా సక్సెస్ నేపథ్యం లో రవితేజ వెంటనే రావణాసుర( Ravanasura ) చితంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.రావణాసుర బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది.

పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న కూడా కలెక్షన్స్ విషయం లో తీవ్రంగా నిరాశ పరచడంతో అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం సినిమా కు సంబంధించిన కలెక్షన్స్ చూస్తుంటే నిర్మాతలు మరియు డిస్ట్రిబ్యూటర్స్ పరిస్థితి ఏంటో అంటూ కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.25 కోట్ల రూపాయల ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా కనీసం 15 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని కూడా నమోదు చేయలేక పోయింది అంటూ ప్రచారం జరుగుతోంది.

Telugu Dhamaka, Ravanasura, Ravi Teja, Tigernageswara-Movie

రావణాసుర సినిమా కలెక్షన్స్ విషయం లో తీవ్రంగా నిరాశ పరిచిన కూడా రవితేజ తదుపరి చిత్రం టైగర్ నాగేశ్వరరావు ( Tiger Nageswara Rao )ఫ్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో మాత్రం తగ్గడం లేదు.రేణు దేశాయ్( Renu Desai ) కీలక పాత్రలో నటించడంతో పాటు ఈ కథ పై ఉన్న నమ్మకం తో కొందరు డిస్ట్రిబ్యూటర్స్ భారీ మొత్తం లో ఈ సినిమా కు పెట్టేందుకు ముందుకు వస్తున్నారట.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఏకంగా రూ.50 కోట్ల థియేట్రికల్‌ ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసే అవకాశం ఉందని.మరో 25 కోట్ల రూపాయలు నాన్ థియేట్రికల్‌ రైట్స్ ద్వారా దక్కించుకునే అవకాశం ఉందని మేకర్స్ అంటున్నారు.

దాదాపుగా 75 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడంతో అంచనాలు భారీగా పెరిగాయి.ఈ సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ చిత్ర నిర్మాతలకు సంతోషాన్ని కలిగిస్తుంది.

ఇదే సమయంలో చిత్రం యొక్క ప్రమోషన్ కార్యక్రమాలను మెల్లగా మొదలు పెట్టాలని కూడా యూనిట్ సభ్యులు భావిస్తున్నారు.రవితేజ ఒక దొంగ పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే.

సినిమా కథ ముందే తెలియడంతో పాటు ఎలా ఉండబోతుందని ఆలోచన ఒక క్లారిటీ ఉంది.కనుక సినిమా సూపర్ హిట్ అవుతుందని నమ్మకం వ్యక్తం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube