లేడీ సూపర్ స్టార్ నయనతార ( Nayanthara )తెలుగు లో నటించేందుకు ఆసక్తి చూపించడం లేదు అనే ప్రచారం జరుగుతుంది.ముఖ్యంగా కమర్షియల్ తెలుగు సినిమాలకి ఆమె నో చెబుతుందట.
ఇటీవల ఒక సీనియర్ స్టార్ హీరో కి జోడి గా నయన తార ను ఎంపిక చేసేందుకు ప్రయత్నించిన దర్శక నిర్మాతలకు చుక్కెదురైందట.తనకు తెలుగు లో నటించేందుకు ఆసక్తిగా లేదంటూ ఆమె మేనేజర్ ద్వారా సమాచారం అందించింది.
లేడీ ఓరియంటెడ్ సినిమాలు( Lady oriented movies ) తమిళం లో మాత్రమే చేస్తూ కెరియర్ లో ముందుకు సాగుతోంది.మరో వైపు హిందీ లో నయనతార జవాన్ చిత్రం( Jawan movie) లో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఆ సినిమా సూపర్ హిట్ అయ్యి తన పాత్ర కు మంచి గుర్తింపు లభిస్తే హిందీ లో వరుసగా సినిమాలు చేయాలని నిర్ణయానికి నయన తార వచ్చింది అంటూ ఆమె సన్నిహితులు చెబుతున్నారు.

లేడీ సూపర్ స్టార్ అంటూ గుర్తింపు దక్కించుకున్న నయనతార అన్ని భాషల్లో కూడా సినిమాలు చేస్తే బాగుంటుంది కానీ ఎంపిక చేసుకొని ఫలానా భాషలోనే సినిమా చేస్తాను అంటే ఎంత వరకు సమంజసం అంటూ కొందరు విమర్శిస్తున్నారు.సోషల్ మీడియా లో ప్రస్తుతం ఈ విషయమై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.నయన తార తెలుగు లో కూడా సినిమాలు చేయాల్సిన అవసరం ఉంది

అంటూ అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.తెలుగు లో ఆమె కు ఉన్న ఫాలోయింగ్ నేపథ్యం లో చాలా మంది ఆమె సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు.కానీ ఆమె మాత్రం ఇలా ఆచి తూచి సినిమాలను ఎంపిక చేసుకోవడం ఎంత వరకు కరెక్ట్ అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
సినిమాల ప్రచారం గురించి ఆమె ఆసక్తి చూపించడం లేదు కానీ గతం తో పోలిస్తే ఈ మధ్య కాలం లో ఆమె సినిమాల ప్రమోషన్ కి మీడియా ముందుకు రావడం అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తుంది.







