టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత( Samantha ) తిరిగి పుంజుకోవాలంటే శాకుంతలం సినిమా( Shaakuntalam ) సూపర్ హిట్ అవ్వాల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొందిన శాకుంతలం సినిమా కి గుణ శేఖర్( Gunasekhar ) దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.
సమంత ఈ సినిమా కోసం కాస్త ఎక్కువగానే కష్ట పడుతోంది.సోషల్ మీడియా తో పాటు అన్ని మీడియాల్లో కూడా సమంత సందడి చేస్తోంది.
అనారోగ్య సమస్యల కారణంగా తన గత చిత్రానికి ఎక్కువ ప్రమోషన్ కార్యక్రమాలు చేయలేక పోయిన సమంత ఈ సినిమా కి మాత్రం గడచిన మూడు నాలుగు వారాలుగా కాళ్లకు చక్రాలు కట్టుకొని తిరిగినట్లుగా తిరుగుతూ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటుంది.

ఆకట్టుకునే అందాన్ని చూపిస్తూ సినిమా గురించి చెబుతూ.సినిమా కోసం తాను పడ్డ కష్టం గురించి చెబుతూ ప్రేక్షకుల దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తుంది.సమంత పూర్వ వైభవం సొంతం చేసుకోవాలంటే ఈ సినిమా కచ్చితంగా విజయాన్ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా ను దిల్ రాజు సమర్పిస్తుండగా గుణ శేఖర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన విషయం తెలిసిందే.ఈ సినిమా తర్వాత సమంత నుండి రాబోతున్న సినిమాలు కచ్చితంగా మరో లెవెల్ అన్నట్లుగా ఉంటాయని అభిమానులు ధీమా తో ఉన్నారు.

ప్రస్తుతం సమంత కొత్త సినిమాలకు కమిట్ అవ్వడం లేదు.ముఖ్యంగా తెలుగు లో కొత్త సినిమాలు చేసేందుకు సమంత శాకుంతలం ఫలితం కోసం ఎదురు చూస్తోంది.అతి త్వరలోనే శాకుంతలం సినిమా ప్రేక్షకులకు ముందు వస్తుంది.కనుక కొత్త సినిమాల ఎంపిక విషయమై సమంత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.గతం లో మాదిరిగా వరుసగా ఏడాది లో నాలుగైదు సినిమాలకు సైన్ చేయాలంటే ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.








