ఇంతకు మునుపు అంటే… సాంకేతికత పెరగని రోజుల్లో, పీఎఫ్ డబ్బుల( PF ) కోసం బ్యాంకు లేదా పీఎఫ్ కార్యాలయం చుట్టూ ఉద్యోగులు తిరగాల్సి వచ్చేది.కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు.
స్మార్ట్ ఫోన్ మీ చేతిలో ఉంటే చాలు, క్యాష్ విత్డ్రా పనిని ఇంట్లో కూర్చొనే చేయవచ్చు.అవును, ఇపుడు ఉమాంగ్ యాప్‌తో( Umang App ) మీ పీఎఫ్ డబ్బును ఈజీగా విత్‌డ్రా చేసుకోవచ్చు.
మీకు అకస్మాత్తుగా డబ్బు అవసరం ఏర్పడినట్టయితే కార్యాలయాల చుట్టూ ఇపుడు తిరిగాల్సిన అవసరం లేదు.ఉమాంగ్ యాప్ ద్వారా మీ పీఎఫ్ ఖాతా నుంచి డబ్బు వెనక్కు తీసుకోవచ్చు.

పీఎఫ్ ఖాతా( PF Account ) నుంచి డబ్బు ఉపసంహరించుకోవడానికి ప్రస్తుతం అనేక మార్గాలు ఉండగా అందులో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఉమాంగ్ యాప్ ఒకటి.దీని ద్వారా, పీఎఫ్ ఖాతా నుంచి సులభంగా డబ్బు వెనక్కు తీసుకోవచ్చు.ఈ యాప్ ద్వారా డబ్బును తీసుకోవడానికి ముందుగా మీ పీఎఫ్ యూనివర్సల్ అకౌంట్ నంబర్ ఆధార్ నంబర్ తో ఖచ్చితంగా లింక్ చేసి ఉండాలి.తరువాత ముందుగా మీ స్మార్ట్ ఫోన్లోకి ఉమంగ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని, మీ వివరాలు రిజిస్టర్ చేయాలి.

మొదట మీ మొబైల్ పోన్ నంబర్ నమోదు చేయాలి.తరువాత యాప్ లో కనిపించే R ఆప్షన్ ఎంచుకోవాలి.తరువాత ‘రైజ్ క్లెయిమ్’ ఎంచుకున్న తరువాత UAN నంబర్ ఎంటర్ చేయాలి.దీని తర్వాత, EPFOలో రిజిస్టర్ అయిన మీ మొబైల్ నంబర్ కి ఓటీపీ వస్తుంది, దానిని ఎంటర్ చేసాక ఇప్పుడు మీరు పీఎఫ్ ఖాతా నుంచి విత్ డ్రాని ఎంచుకుని, సదరు ఫారం పూర్తి చేయండి.
ఫారాన్ని సరిగా పూర్తి చేసిన తర్వాత సబ్మిట్ నొక్కండి.ఇప్పుడు, మీ పీఎఫ్ ఖాతా నుంచి నగదు ఉపసంహరణ కోసం రిఫరెన్స్ నంబర్ మీకు వస్తుంది.ఈ నంబర్ ద్వారా, డబ్బు ఉపసంహరణ అభ్యర్థనను మీరు ఎప్పటికప్పుడు ట్రాక్ చేయవచ్చు.దాదాపుగా 3 నుంచి 5 రోజుల్లో మీ బ్యాంక్ ఖాతాకు సదరు డబ్బు బదిలీ అవుతుంది.







