వేణు స్వామి పరిచయం అవసరం లేని పేరు ప్రముఖ జ్యోతిష్యుడుగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వేణు స్వామి( Venu Swamy ) తరచూ సినిమా సెలబ్రిటీల జాతకాల గురించి చెబుతూ వార్తల్లో నిలుస్తున్నారు.అయితే ఈయన చెప్పిన మాటలు నిజమవడంతో ఈయన చెప్పే మాటలను నమ్మే వారి సంఖ్య రోజుకి అధికమవుతుంది.
ఇక వేణు స్వామి చేత ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు వారు కెరియర్ కోసం ప్రత్యేకంగా పూజలు చేయించుకున్న విషయం కూడా మనకు తెలిసిందే.అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి వేణు స్వామి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా వేణు స్వామి మాట్లాడుతూ సాంప్రదాయాల గురించి పలు విషయాలను వెల్లడించారు.మన దేశంలో ఎన్నో ఆలయాలలో స్వామివారికి మద్యం( Alcohol ) మాంసం ( Non Veg ) నైవేద్యంగా పెడుతున్నారని తెలిపారు.అలాగే బ్రాహ్మణులు కూడా తింటున్నారని తెలిపారు.అయితే తాను ఆచార వ్యవహారాలను నియమనిష్టలతో పాటించే బ్రాహ్మణుల గురించి మాట్లాడటం లేదని దొంగ చాటుగా బ్రాహ్మణులు అనే ముసుగు వేసుకొని లోపల మద్యం మాంసం తినేవారి గురించి మాట్లాడుతున్నానని తెలిపారు.

నేను కూడా దొంగచాటుగా మద్యం తాగుతానని, మాంసం కూడా తింటానని వేణు స్వామి తెలిపారు.అయితే నేను వీటిని బయటకు చెప్పవలసిన అవసరం లేదు కానీ నేను ఎందుకు చెప్పాను అంటే నేను ఒక భోగిని అంటే అనుభవించే వాడిని.ఇలా చేయడం తప్పు కాదని ఆయన తెలిపారు.

ఇక తాను ఎక్కడికి వెళ్తే అక్కడ వాతావరణ పరిస్థితులను బట్టి తన పద్ధతులు అలవాట్లు కూడా మార్చుకుంటానని వేణు స్వామి ఈ సందర్భంగా తెలియజేశారు.ఇలా ఈయన మద్యం తాగుతా, మాంసం తింటానని చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







