గవర్నర్ల వ్యవస్థపై విమర్శలు ! ఇప్పుడు కేటీఆర్ వంతు 

దేశవ్యాప్తంగా బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో గవర్నర్లు వ్యవహరిస్తున్న తీరుపై చాలా కాలంగా వివాదాలు చెలరేల్తూనే ఉన్నాయి.ఆయా రాష్ట్రాల్లోని అధికార పార్టీలను గవర్నర్ల ద్వారా ఇబ్బంది పెట్టే ప్రయత్నం కేంద్ర అధికార పార్టీ బిజెపి చేస్తోందనే విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి.

 Criticism Of The System Of Governors Now Its Ktrs Turn ,ktr, Kcr, Telangana, Gov-TeluguStop.com

ముఖ్యంగా పశ్చిమబెంగాల్ , తమిళనాడు, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో బహిరంగంగానే గవర్నర్ల తీరును తప్పుపడుతూ ఆయా అధికార పార్టీలు విమర్శలు చేస్తున్నాయి.గో బ్యాక్ రవి( Go back Ravi ) అంటూ తమిళనాడు గవర్నర్ ను ఉద్దేశించి అక్కడ అధికార పార్టీ బహిరంగంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తోంది.

తెలంగాణలో బీఆర్ఎస్ అధినేత కేసిఆర్( KCR) కు,  తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందర రాజన్( Tamila sai soundara Rajan ) కు మధ్య ప్రోటోకాల్ వివాదం ఏర్పడడం,  ఇక అక్కడి నుంచి అనేక విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి,  గవర్నర్ కు మధ్య వివాదాలు చెల రేగుతూనే ఉన్నాయి.

Telugu Amith Sha, Central, Governor, Tamilasai, Telangana-Politics

కేసీఆర్ వ్యవహార శైలి పై మండిపడుతూ గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా( Amit Shah ) గవర్నర్ కు ఫిర్యాదు చేశారు .ఈ వ్యవహారం కోర్టుల వరకు వెళ్ళింది.ఇది ఇలా ఉంటే …తాజాగా బీఆర్ఎస్ మంత్రి,  కేసీఆర్ కుమారుడు కేటీఆర్ గవర్నర్ వ్యవస్థపై విమర్శలు చేశారు.

  గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ ట్వీట్ చేశారు.బిజెపియేతర  రాష్ట్రాలను ఇబ్బందులకు గురి చేసే విధంగా గవర్నర్లు తమ అధికారాల్ని నిర్దాక్షిణ్యంగా దుర్వినియోగం చేస్తున్నారని దిలీప్ విమర్శించారు.

Telugu Amith Sha, Central, Governor, Tamilasai, Telangana-Politics

బ్రిటిష్ కాలం నాటి వలసవాద గవర్నర్ వ్యవస్థ రద్దు చేయాల్సిన సమయం వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు.  అలాగే గవర్నర్లకు వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని ఆయన సమర్ధించారు.

Telugu Amith Sha, Central, Governor, Tamilasai, Telangana-Politics

ఈ ట్వీట్ పై స్పందించిన కేటీఆర్ అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు కేంద్ర ప్రభుత్వం చేతులు రాజకీయ పావులుగా మారడం బాధాకరమని అన్నారు.బిజెపి రాష్ట్రాలను చూస్తే వాటికి కేంద్రం ఆధీనంలో ఉన్న గవర్నర్లు సహకరించకపోవడం,  ప్రతీకారం తో వ్యవహరించడం కనిపిస్తోందని,  ఇటువంటి వైఖరి సహకార సమాఖ్య పాలనకు మోడలా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube