జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ తెరిచేందుకు ఉత్కంఠ కొనసాగుతోంది.హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్ ఇప్పటికే తెరుచుకోవాల్సి ఉంది.
అయితే తాళం చెవులు దొరకకపోవడంతో జాప్యం కొనసాగుతోందని అధికారులు చెబుతున్నారు.అధికారుల తీరుపై కాంగ్రెస్ నేత అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
తాళాలు కలెక్టర్, జాయింట్ కలెక్టర్ దగ్గర ఎందుకు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు.మరోవైపు తాళాల కోసం అధికారులు వెతుకుతున్నారు.







