1.కోవిడ్ మాక్ డ్రిల్
కరోనా వైరస్ కేసులు అకస్మాత్తుగా పెరిగిన నేపథ్యంలో నేడు దేశ వ్యాప్తంగా కోవిడ్ మాక్ డ్రిల్ నిర్వహించారు.
2.జూపల్లి ,పొంగులేటి పై మంత్రి విమర్శలు

బీ ఆర్ ఎస్ నుంచి సస్పెండ్ అయిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి( Ponguleti Srinivas Reddy ) పై మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.పార్టీ కంటే వ్యక్తులే గొప్ప అని చెప్పే ప్రయత్నం వారిద్దరు చేస్తున్నారని మంత్రి విమర్శించారు.
3.ఏపీ అప్పులపై శ్వేత పత్రం విడుదల చేయాలి
ఏపీ ప్రభుత్వం చేసిన అప్పలపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని టిడిపి నేత కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు.
4.కే ఏ పాల్ పిటిషన్ కొట్టివేత

తెలంగాణ సచివాలయంలో అగ్నిప్రమాదం పై సీబీఐ విచారణ జరపాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది.
5.స్టీల్ ప్లాంట్ విషయంలో బీఆర్ఎస్ కు సీపీఐ మద్దతు
విశాఖ స్టీల్ ప్లాంట్ కొనుగోలు బిడ్ లో పాల్గొంటున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి తాము మద్దతు ఇస్తున్నామని సిపిఐ నారాయణ అన్నారు.
6.బీఆర్ఎస్ నుంచి జూపల్లి, పొంగులేటి సస్పెన్షన్

బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు , మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని సస్పెండ్ చేశారు.
7.ఏపీలో నేడు రేపు వడ గాల్పులు
ఏపీలో నేడు రేపు వడగాల్పులు, భారీ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
8.‘మీ డిగ్రీ ని చూపించు ‘ ఆప్ కొత్త ప్రచారం

ప్రధాని నరేంద్ర మోది డిగ్రీకి సంబంధించిన అంశంపై ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శలు పెంచింది .ఈ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ ‘ మీ డిగ్రీ ని చూపించు ‘ అనే ప్రచారాన్ని ప్రారంబించింది.
9.ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించండి
యుద్ధ ప్రాతిపదికన తెలంగాణలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని అధికారులను బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు.
10.బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ లో నేడు బి ఆర్ ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారు.
11.హరీష్ రావు పర్యటన

నేడు సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటిస్తున్నారు.నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటున్నారు.
12.గ్రేడ్ వన్ సూపర్ వైజర్ నియామక పరీక్షలపై హైకోర్టులో పిటిషన్
టిఎస్సిపీఎస్సీ , సీడీపీవో , గ్రేడ్ 1 సూపర్ వైజర్ నియామక పరీక్షలపై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది.ఎన్ ఎస్ యూ ఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ తో పాటు , 76 మంది అభ్యర్థులు పిటిషన్ లు వేశారు.
13.టీటీడీకి 250 ఎకరాల భూమి విరాళం
తిరుమల తిరుపతి దేవస్థానానికి 250 ఎకరాల తన భూములను విరాళంగా అందజేయనున్నట్లు బెంగళూరుకు చెందిన మురళీకృష్ణ అనే వ్యక్తి ప్రకటించారు.
14.టీచర్లపై కక్ష సాధింపు మానుకోవాలి

టీచర్లపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని, ఆ కక్ష సాధింపు మానుకోవాలని టిడిపి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు.
15.విద్యాశాఖ పై జగన్ సమీక్ష
విద్యాశాఖ అధికారులతో ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి విద్యాశాఖ అధికారులతో మంత్రి బొత్స సత్యనారాయణ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
16.జై భీమ్ డైరెక్టర్ తో రజనీకాంత్ సినిమా

‘జై భీమ్ ‘ దర్శకుడు జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా లైకా ప్రొడక్షన్స్ పై సుభాస్కరన్ ఓ సినిమా ను నిర్మిస్తున్నారు.
17.భారత్ లో కరోనా
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 5,880 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
18.తెలంగాణ పెండింగ్ బిల్లులపై సుప్రీం లో విచారణ

తెలంగాణ పెండింగ్ బిల్లుల ఆమోదం పిటిషన్ పై సుప్రీం కోర్టు లో ఈ రోజు విచారణ జరిగింది.
19.కేసీఆర్ పై పొంగులేటి ఆగ్రహం
ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు.ఈ ప్రభుత్వాన్ని మూడోసారి అధికారంలోకి ఎందుకు తీసుకురావాలి అంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం పై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శలు చేశారు .తప్పులు చేశారు శిక్ష తప్పదు అంటూ కేసిఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 55,400
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 60,430
.