ప్రస్తుత కాలంలో పెద్దలు కుదిర్చిన వివాహాల కంటే.ప్రేమించి( Love Marriage ) పెళ్లి చేసుకుంటున్న వివాహాలే చాలా ఎక్కువ.
అయితే ప్రేమించుకున్న తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడం లేదంటే పారిపోయి పెళ్లి చేసుకోవడం అందరికీ తెలిసిందే.ఇలాంటి కోవకు చెందిన ఒక ఘటన గురించి పూర్తిగా చూద్దాం.
ఓ యువకుడు గాఢంగా ఓ యువతిని ప్రేమించి ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు.కానీ యువతి బంధువులు వీరి ప్రేమకు అంగీకారం తెలపకుండా ఆ యువకుడిని కత్తులతో వెంటాడి దారుణంగా హత్య చేసిన ఘటన ఆదివారం నల్లగొండ జిల్లా నిడమనూరు మండలంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకెళితే నల్లగొండ జిల్లాలోని( Nalgonda ) త్రిపురారం మండలం అన్నారం గ్రామంలో నివసించే నవీన్ (21),( Naveen ) అదే గ్రామానికి చెందిన ఒక యువతి (20) దాదాపు నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు.నవీన్ మిర్యాలగూడలో కార్ మెకానిక్ గా పనిచేస్తున్నాడు.
నవీన్ దళితుడు కుటుంబానికి చెందినవాడు.వీరిద్దరి కుటుంబాలు కులాల కారణంగా వీరి ప్రేమకు అంగీకారం తెలుపలేదు.
ప్రేమ వివాహారం బయటపడడంతో యువతి బంధువులు యువతికి పెళ్లి సంబంధం చూశారు.ఈ విషయం తెలిసి నవీన్ విషం తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు.వెంటనే ఆసుపత్రిలో చేర్చడంతో ప్రమాదం నుండి బయటపడ్డాడు.తర్వాత యువతి బంధువులు నవదీప్, మణిదీప్ లు నవీన్ కు ఫోన్ చేసి యువతిని మర్చిపోవాలని బెదిరించారు.
యువతిని మర్చిపోలేకపోతున్న నవీన్ ఆదివారం తన స్నేహితుడు ఈట అనిల్ తో కలిసి నిడమనూరు మండలం గుంటిపల్లి కి చెందిన పాల్వాయి తిరుమల్ వద్దకు వెళ్లారు.యువతి కుటుంబ సభ్యులతో మాట్లాడి తమ పెళ్లి చేయాలని కోరడంతో, తిరుమల్ ఆ యువతి బంధువులకు ఫోన్ చేసి మాట్లాడేందుకు పిలిచాడు.యువతి బంధువులు కాసేపటికి 9 మంది వ్యక్తులు మూడు బైకులపై వచ్చారు.
ఆ వ్యక్తులు వస్తూనే నవీన్ పై కత్తులతో దాడికి దిగడంతో అనిల్, తిరుమల్ అక్కడి నుండి పారిపోయారు.
నవీన్ కూడా తప్పించుకునే ప్రయత్నం చేయగా వెంటాడి కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి చంపేశారు.సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అనిల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.