వినడానికి విచిత్రంగా వున్నా మీరు విన్నది అక్షరాలా నిజం.ఒక మహిళ( Woman ) మీసం, గడ్డం పెంచి ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు( Guinness World Record ) కొట్టేసింది మరి.
పురుషులకే సొంతమైన గడ్డాలు, మీసాలు అరుదుగా కొంతమంది మహిళలకు కూడా వస్తూ ఉంటాయి.మనం చాలామందిని చూస్తూ ఉంటాము.
అయితే వీటికి కొన్ని హార్మోనుల ఇంబేలెన్స్ కారణం అని నిపుణులు చెబుతూ వుంటారు.అయితే అలాంటి స్త్రీలు బయట కాలు పెట్టడానికి సంకోచిస్తూ వుంటారు.
చాలా ఆత్మన్యూనతకు గురి అవుతూ వుంటారు.అయితే ఆమె అలా కాదు.
ఆమె బలహీనతనే బలంగా మార్చుకుంది.కట్ చేస్తే మీసం, గడ్డం పెంచి.
ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు కొట్టేసింది.

అవును, ఆమె తనకు గడ్డాలు, మీసాలు పెరుగుతున్నాయని మదనపడిపోయి జీవితాన్ని నాశనం చేసుకోలేదు.ఆమెను చూసి ఎవ్వరు నవ్వినా, ఏడ్చినా ఆమె ఈ సమాజాన్ని పట్టించుకోలేదు.ఎవరైతే దేనిని చూసి నవ్వుతున్నారో దానినే ఆమె ప్రేమించింది.
ఇక ఆమె మొక్కవోని సంకల్పం ముందు ఆ బలహీనత బలంగా మారి ఆఖరికి గిన్నిస్ వరల్డ్ రికార్డు తెచ్చిపెట్టింది.ఆమె మరెవ్వరో కాదు అమెరికాకు చెందిన 74 ఏళ్ల వివిఎన్ వీలర్( Vivian Wheeler ) అనే మహిళ.

ఈమెకు హైపర్ ట్రైకోసిస్ సిండ్రోమ్ కారణంగా గడ్డం మీసం పెరుగుతూ వచ్చింది.మొదట అందరి ఆడవాళ్ళలాగా ఆమె సిగ్గుపడిపోయి షేవింగ్ చేసుకునేది.చాలా సంవత్సరాలు అలా ఆమె తన గడ్డాన్ని, మీసాన్ని సమాజానికి తెలియకుండా దాచిపెట్టేది.కానీ ఒకానొక సమయంలో ఆమె తనలో తాను మధనపడింది.ఈ బలహీనతను బలంగా ఎందుకు మార్చుకోకూడదు అని సంకల్పించింది.అక్కడినుండి తన రూపాన్ని బహిర్గతం చేసింది.
తర్వాత పొడవుగా గడ్డం మీసం పెంచి ఏకంగా పొడవైన గడ్డం, మీసం కలిగిన మహిళగా గిన్నిస్ బుక్ రికార్డు సంపాదించింది.







