నాగార్జున( Nagarjuna ) సినిమా గురించి గత కొన్ని రోజులుగా ఆసక్తికర చర్చ జరుగుతుంది.ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు.
కానీ సినిమా షూటింగ్ మొదలైంది అంటూ ఆ మధ్య కొందరు హడావుడి చేశారు.ప్రసన్న కుమార్ బెజవాడ( Prasanna Kumar Bezawada ) దర్శకత్వంలో నాగార్జున హీరోగా ఒక సినిమా రూపొందుతోంది అనేది కన్ఫర్మ్ వార్త.
అయితే అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.నాగార్జున గత చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పర్చాయి.
అందుకే ఈ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.ధమాకా చిత్రం( Dhamaka ) తో సక్సెస్ దక్కించుకున్న రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ ఈ సినిమా తో దర్శకుడుగా పరిచయం అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకుంటాడు అనే నమ్మకాన్ని నాగార్జున కలిగి ఉన్నాడు.
గతం లో నాగార్జున ఎంతో మంది కొత్త దర్శకులను ఇండస్ట్రీ కి పరిచయం చేశాడు, ఆ కారణంగానే సెంటిమెంట్ పునరావృతం కాబోతుంది అనే ఉద్దేశం తో అక్కినేని అభిమానులు( Akkineni Fans ) ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
భారీ బడ్జెట్ కాకుండా మీడియం రేంజ్ బడ్జెట్ తో సినిమా ను రక్షించడం ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు.
అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కమర్షియల్ చిత్రాన్ని దర్శకుడు ప్రసన్న కుమార్ బెజవాడ రూపొందిస్తున్నట్లుగా తెలుస్తుంది.అతి త్వరలోనే ఈ సినిమా కు సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతుంది.
ఇక ఈ సినిమా లో నాగార్జున ద్వి పాత్రాభినయం లో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.

నాగార్జున రెండు విభిన్నమైన పాత్ర లో కనిపించబోతున్న నేపథ్యం లో ఆయన అభిమానులు సర్ప్రైజ్ అవ్వడం ఖాయం అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చాలా నమ్మకంగా చెబుతున్నారు.ఈ సంవత్సరం లోనే సినిమా ను ప్రేక్షకల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు.







