ఆ పాటకు మాత్రం నిద్రలో లేపినా స్టెప్పులేస్తా.. సాయిపల్లవి కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సాయిపల్లవి( Sai Pallavi )మంచి డ్యాన్సర్ అనే సంగతి తెలిసిందే.సాయిపల్లవి డ్యాన్స్( Sai Pallavi Dance ) కోసమే సినిమాలను చూసే అభిమానుల సంఖ్య తక్కువేం కాదు.

 Saipallavi Shocking Comments About Dolare Dola Song Detaisl Here Goes Viral,sai-TeluguStop.com

సాయిపల్లవి ప్రస్తుతం తక్కువగానే సినిమాలు చేస్తున్నా కథ నచ్చితే మాత్రం ఆమె ఎక్కువ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని ఫ్యాన్స్ చెబుతున్నారు.సాయిపల్లవిని మెప్పించే కథలతో దర్శకనిర్మాతలు సంప్రదించాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

అయితే సినిమాలకు దూరంగా ఉన్నా ఈ బ్యూటీ వరుస ఇంటర్వ్యూల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.ఒక పాటకు మాత్రం నిద్రలో లేపినా స్టెప్పులు వేస్తానంటూ సాయిపల్లవి కామెంట్లు చేశారు.డోలారే డోలా సాంగ్( Dolare Dola Song ) గురించి మాట్లాడుతూ సాయిపల్లవి ఈ కామెంట్లు చేశారు.ఆ పాట అంటే తనకు చాలా ఇష్టమని ఆమె తెలిపారు.

డ్యాన్స్ కు ప్రాధాన్యత ఉన్న సినిమాలలో నటించడం తనకు ఇష్టమని సాయిపల్లవి చెప్పుకొచ్చారు.

సినిమా ఇండస్ట్రీలో తాను ఈ స్థాయికి చేరుకోవడానికి డ్యాన్స్ ఒక విధంగా కారణమని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.ఐశ్వర్యా రాయ్( Aishwarya Rai ), మాధురీ దీక్షిత్( Madhuri Dixit ) డ్యాన్స్ లను చూస్తూ తాను పెరిగానని వాళ్ల డ్యాన్స్ అంటే తనకు ఎంతో ఇష్టమని సాయిపల్లవి కామెంట్లు చేశారు.కథ నచ్చితే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇస్తానని ఆమె చెబుతున్నారు.

శేఖర్ కమ్ముల( Sekhar Kammula ) డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

కథ నచ్చితే కొత్త డైరెక్టర్ డైరెక్షన్ లో నటించడానికి కూడా సాయిపల్లవి సిద్ధంగా ఉంటారు.

మేకప్ లేకుండా కనిపించడానికి ఆమె ఎంతో ఇష్టపడతారు.సాయిపల్లవి ఇతర హీరోయిన్లకు భిన్నంగా అడుగులేస్తుండగా ఆమె చెల్లెలు పూజకు కూడా సినిమాలపై ఆసక్తి ఉంది.

సాయిపల్లవి ఇతర ఇండస్ట్రీలలో కూడా సత్తా చాటాలని ఫ్యాన్స్ చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube