భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం జరగనుంది.ఈ సమ్మేళనానికి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు హజరుకానున్న సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ పొంగులేటి ఆహ్వానం మేరకు ఆత్మీయ సమ్మేళనానికి వచ్చానని చెప్పారు.పార్టీలో చేరికపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.
ఈ మేరకు కార్యకర్తలతో చర్చిస్తున్నానని పేర్కొన్నారు.బీఆర్ఎస్ పాలనలో ఏం అభివృద్ధి జరిగిందో చూస్తూనే ఉన్నామన్న జూపల్లి తెలంగాణ సాధించుకున్న లక్ష్యాలు నెరవేరలేదని తెలిపారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని స్పష్టం చేశారు.ప్రజల కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటామని వెల్లడించారు.







