వైసీపీలో చాప కింద నీరులా విస్తరిస్తున్నఆ సామాజిక వర్గ అసంతృప్తి?

151 మంది ఎమ్మెల్యేలతో గత నాలుగు సంవత్సరాలుగా తిరుగులేని శక్తిగా కనబడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు అసంతృప్తి జ్వాలలు ఎగసి పడుతున్నాయి… ఇంతకాలం అంతర్గత పార్టీ మీటింగ్లలో కూడా వ్యతిరేకత కనపరచని నేతలు ఇప్పుడు బహిరంగంగా పార్టీపై, పార్టీ అధినాయకత్వంపై విమర్శలు చేస్తున్నారు.జగన్ ప్రభుత్వం ఈ స్థాయిలో సీట్లు దక్కించుకోవడంలో రెడ్డి సామాజిక వర్గం ముందుండి పని చేసిందన్న సంగతి అందరికీ తెలిసిందే .

 Reddy Leaders Not Satisfied With Jagan, Ys Jagan, Ap Politics , Tdp, Reddy Lea-TeluguStop.com

ముందు నుంచి వైఎస్ ఫ్యామిలీకి అండదండగా ఉంటున్న రెడ్డి సామాజిక వర్గం నికి రాజశేఖర రెడ్డి కూడా చాలా ప్రాముఖ్యత నిచ్చేవారు .కీలక మంత్రి పదవులు కూడా ఇచ్చేవారు .ఆ అంచనాలతోనే జగన్మోహన్ రెడ్డి విజయంలో కీలకపాత్ర పోషించింది.

Telugu Ap, Janasena, Pawan Kalyan, Reddy, Ys Jagan, Ysrcp-Telugu Political News

అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సలహాదారులు లాంటి కొన్ని పదవులు తప్ప కీలకమైన మంత్రి పదవుల విషయంలో మాత్రం రెడ్డి సామాజిక వర్గానికి జగన్ మొండి చేయి చూపించారని చెప్తారు .25 మంది ఉన్న క్యాబినెట్లో కీలకమైన మంత్రి పదవుల్లో ముగ్గురు నలుగురు రెడ్డి మంత్రులు కూడా లేకపోవడం ఆ సామాజిక వర్గాన్ని అసంతృప్తి గురిస్తుంది ఉన్నవారిలో కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి( Anam Ramanarayana Reddy ) వంటి వారిని రకరకాల కారణాలతో సస్పెండ్ చేశారు.ఇలా తమ సామాజిక వర్గాన్ని సైడ్ లైన్ చేస్తున్న విధానంతోవారి లో అసంతృప్తి జాలలు ఎగిసిపడుతున్నాయి అందుకే ఒక్కొక్కరుగా ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు… కొత్తగా కర్నూలు జిల్లా ఎమ్మెల్యే ఆదోని సాయి ప్రసాద్ రెడ్డి( Sai Prasad Reddy ) ప్రభుత్వంపై గళం ఎత్తారు .ఈయన ఏకంగా నాయకుడు జగన్ కి గురి పెట్టారు.జగన్కు పాలన అనుభవం లేదని, ఎమ్మెల్యేలను ఎలా డీల్ చేయాలో జగన్కు తెలియటం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన ఆయన పార్టీ లో అసంతృప్తి చాలానే ఉంది అంటూ చెప్పడం కొసమెరుపు.

Telugu Ap, Janasena, Pawan Kalyan, Reddy, Ys Jagan, Ysrcp-Telugu Political News

ఒకవైపు పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గాన్ని దగ్గరికి చేసుకొని తన వెంట నిలబడేలా చేసుకుంటూ ముందుకు వెళుతుంటే ,,తెలుగుదేశం పార్టీ కూడా అధికారం చేతిలో లేకపోయినా కమ్మ సామాజిక వర్గ నేతలు మద్దతు చెయ్యి జారకుండా చూసుకోగలిగింది .కానీ జగన్( YS JAGAN ) మాత్రం తనకు అధికారం రావడంలో కీలక పాత్ర పోషించిన సామాజిక వర్గాలను దూరం చేసుకుంటున్నారని ఇది వచ్చే ఎన్నికలలో పార్టీకి రాజకీయ గుణపాఠం నేర్పిస్తుందని విశ్లేషణలు వినబడుతున్నాయి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube