105 మందిని పెళ్లి చేసుకున్న ప్రబుద్ధుడు... 14 దేశాలకు అల్లుడు కూడా... కట్ చేస్తే?

భారత సంప్రదాయంలో వివాహానికి పెద్దపీట వేయడం జరిగింది.ఇక్కడ స్త్రీమూర్తికి చాలా గౌరవం ఇస్తారు.

 A Man Married 105 People... Also Son-in-law Of 14 Countries , Man , Viral Late-TeluguStop.com

ఏ పురుషుడైనా ఒక్కరిని మించి ఎక్కువమందిని పెళ్లాడదు.అయితే ఫారిన్ కంట్రీలలో బహుభార్యత్వం అనేది ఉంటుంది.

ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు పెళ్లిళ్లు చేసుకుంటూ పోతారు.ఇక కొంతమంది వుంటారు… ఒకరికి తెలియకుండా వేరొకరి పెళ్లి చేసుకుంటూ చీట్ చేస్తూ వుంటారు.

అయితే అలాంటివారు ప్రతిచోటా వుంటారు లెండి.ఈ 105 మందిని పెళ్లి చేసుకున్న ప్రబుద్ధుడు గురించి తెలియాలంటే మీరు ఈ కథలోకి వెళ్లాల్సిందే.

ఇతగాడు ఏకంగా వందకుపైగా పెళ్లిళ్లు చేసుకుని యావత్ ప్రపంచానికి షాక్ ఇచ్చాడు.ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, అతను తన భార్యలలో ఒకరికి కూడా విడాకులు ఇవ్వకపోవడం.

దీనికి సంబంధించిన వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కూడా ట్విట్టర్‌లో షేర్ చేయగా ప్రస్తుతం ఈ కధనం వైరల్ అవుతోంది.వివరాల్లోకి వెళితే.

ఆ వ్యక్తి పేరు గియోవన్నీ విగ్లియోటో( Giovanni Vigliotto ).అతను 1929లో సిసిలీ( Sicily )లోని సిరాకుసాలో జన్మించాడు.విచారణ సమయంలో, అతను తన అసలు పేరు నికోయ్ పెరుస్కో అని వెల్లడించాడు.

Telugu America, Sicily, Son, Latest-Latest News - Telugu

అతను 1949 1981 మధ్య 105 మంది స్త్రీలను పెళ్ళాడాడు.వారిలో ఎవరికీ ఒకరి గురించి మరొకరికి తెలియకపోవడం కొసమెరుపు.ఆ విధంగా వారిని ట్రాప్ చేసాడు.

ఈ క్రమంలో అమెరికా( America )లోని రాష్ట్రాలతో పాటు 14 ఇతర దేశాలలోని యువతులను అతగాడు పెళ్లి చేసుకున్నాడు.ప్రతిసారీ ఫేక్‌ పత్రాలతో నకిలీ పేర్లతో యువతులతో పరిచయం పెంచుకొని కొన్ని రోజులు స్నేహం నటించి తర్వాత వారికి ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకునే వాడు.

పెళ్లైన అనంతరం తాను చాలా దూరంలో జాబ్ చేస్తున్నాని.ఉద్యోగ నిమిత్తం తప్పినిసరి వెళ్లాలి అంటూ భార్యకు చెందిన విలువైన వస్తువులు, ఆభరణాలు, డబ్బు తీసుకుని పరారయ్యేవాడు.

చివరికి డిసెంబర్ 28, 1981న పోలీసుల చేతికి చిక్కాడు.కట్ చేస్తే న్యాయస్థానం అతనికి మొత్తం 34 ఏళ్ల జైలు శిక్షతో పాటు 336,000 డాలర్ల జరిమానా కూడా విధించింది.

ఆఖరికి 1991 లో 61 సంవత్సరాల వయస్సులో మెదడులో రక్తస్రావం జరగడంతో మరణించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube