టాలీవుడ్ ఇండస్ట్రీలో లేడీ కమెడియన్ గా గుర్తింపును సంపాదించుకుని సత్తా చాటిన అతికొద్ది మంది సెలబ్రిటీలలో విద్యుల్లేఖ రామన్( vidyullekha ఒకరు.తెలుగులో పలు బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి గుర్తింపును సంపాదించుకున్న ఈ నటి ప్రస్తుతం పరిమితంగా సినిమాలలో నటిస్తూ సక్సెస్ లను సొంతం చేసుకుంటున్నారు.
తాజాగా బుల్లితెరపై ఒక షోలో మాట్లాడిన ఈ నటి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
నేను లావుగా ఉండటంతో చాలామంది నన్ను ట్రోల్ చేశారని విద్యుల్లేఖ చెప్పుకొచ్చారు.
పంది, ఏనుగు( Pig, elephant ) అంటూ నన్ను వేర్వేరు జంతువులతో పోల్చారని ఆమె కామెంట్లు చేశారు.అలా చేసే కామెంట్లను నేను లైట్ తీసుకునేదానినని నేను ఎంత లైట్ తీసుకున్నా ఏదో ఒక సమయంలో అది గుచ్చుకుంటుందని విద్యుల్లేఖ చెప్పుకొచ్చారు.
నా హనీమూన్ సమయంలో నేను స్విమ్ సూట్ వేసుకున్నానని ఆమె తెలిపారు.

ఆ సమయంలో కొంతమంది నా గురించి కామెంట్ చేస్తూ ఛీ ఇది ఒక అమ్మాయేనా అంటూ తిట్టారని విద్యుల్లేఖ చెప్పుకొచ్చారు.ఆమె వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇతరులను కామెంట్ చేసేవాళ్లు తమను ఎవరైనా ట్రోల్స్ చేస్తే మాత్రమే ఆ బాధ అర్థమవుతుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కాజల్( Kajal ) గర్భవతిగా ఉన్న సమయంలో ఆమెపై కూడా ట్రోల్స్ వచ్చాయనే సంగతి తెలిసిందే.

సోషల్ మీడియా వినియోగం ఎక్కువైన తర్వాత కొంతమంది కావాలనే సెలబ్రిటీలను టార్గెట్ చేసూ ట్రోల్స్ చేస్తుండటం గమనార్హం.విద్యుల్లేఖ రామన్ కెరీర్ పరంగా మరింత బిజీ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.విద్యుల్లేఖకు కెరీర్ పరంగా ఆఫర్లు అంతకంతకూ పెరుగుతున్నాయి.
విద్యుల్లేఖ ప్రస్తుతం తన లుక్ ను సైతం పూర్తి స్థాయిలో మార్చుకున్నారు.తమిళంలో కూడా విద్యుల్లేఖకు మంచి గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే.







