Shajan Padamsee : ఆరెంజ్ మూవీలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఎక్కడుందో తెలుసా.. ఇప్పుడేం చేస్తుందంటే?

పది సంవత్సరాల కిందట మెగా హీరో రామ్ చరణ్( Ram Charan ) నటించిన ఆరెంజ్ మూవీ ఎంతలా డిజాస్టర్ పలికిందో చూసాం.జెనీలియా( Genelia ) ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.

 Do You Know Where This Cute Girl Who Acted In The Movie Orange Is What Is She D-TeluguStop.com

ఇక ఈ సినిమా మంచి కథతో వచ్చినప్పటికీ కూడా అప్పటి ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.ఇక అదే సినిమా ఇటీవలే రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా విడుదల కాగా మంచి వసూలు సొంతం చేసుకుంది.

ఈ తరం ప్రేక్షకులను ఈ సినిమా కథ బాగా ఆకట్టుకుంది.ఇందులో వచ్చిన పాటలో కూడా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.

అలా ఈ సినిమా సక్సెస్ కావడానికి దాదాపు పది సంవత్సరాలు పట్టిందని అర్థమైంది.

అలా సినిమా మళ్లీ విడుదల కావడంతో ఒక్కసారి ప్రేక్షకులంతా ఆ పాటలతో బాగా ఎంజాయ్ చేశారు.

మరోసారి ఆ నటీనటులను గుర్తుకు చేసుకున్నారు.అయితే అందులో జెనీలియాతో పాటు మరో హీరోయిన్ కూడా ఉన్న సంగతి తెలిసిందే.

రూబా పాత్రలో నటించి కుర్రాళ్ళ హృదయాలను దోచుకుంది.ఇక ఆమె అసలు పేరు షాజన్ పదమ్సీ( Shajan Padamsee ).ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్.

ఎక్కువగా హిందీ సినిమాలలో చేసింది.

ఇక ఈమె తల్లిదండ్రులు కూడా ఇండస్ట్రీకి చెందిన వాళ్లే.అలా వారి హోదాతో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తొలిసారిగా రాకెట్ సింగ్: సేల్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్( Rocket Singh: Sales Man of the Year ) అని సినిమాతో ఇండస్ట్రీకి అడుగు పెట్టింది.తొలి సినిమాతోనే మంచి మార్కులు సంపాదించుకుంది.ఇక ఆ తర్వాత ఏడాదే తమిళ ఇండస్ట్రీ తో పాటు, ఆరెంజ్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి అడుగు పెట్టింది.

Telugu Orange, Ram Charan, Shajan Padamsee, Tollywood-Movie

కానీ ఆ సినిమాలో ఆమెకు అంతగా గుర్తింపు ఇవ్వలేకపోయాయి.ఆ తర్వాత హిందీలో వరుసగా నటించి మరోసారి మసాలా సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి అడుగు పెట్టింది.కానీ ఆ సినిమా కూడా అంత సక్సెస్ కాలేకపోయింది.దీంతో మళ్లీ బాలీవుడ్( Bollywood ) లో సెటిల్ అయ్యింది.ఇక ఇప్పుడు నటనకు దూరంగా ఉంటూ సూపర్ ధమాల్ అనే టీవీ షోలో హోస్ట్ గా చేస్తుంది.

Telugu Orange, Ram Charan, Shajan Padamsee, Tollywood-Movie

ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.తనకు సంబంధించిన ఫోటోలను బాగా షేర్ చేసుకుంటుంది.ఈ బ్యూటీ కూడా బాగా హాట్ షో చేస్తూ ఉంటుంది.

పొట్టి పొట్టి బట్టలు వేస్తూ బాగా హడావుడి చేస్తూ ఉంటుంది.ఇక ఇటీవలే ఆరెంజ్ మూవీ మళ్లీ విడుదల కావడంతో ఈసారి తెలుగు ప్రేక్షకులు ఈమె గురించి తెగ వెతుకులాట ప్రారంభించారు.

ఇప్పుడు ఎక్కడ ఉంది.ఏం చేస్తుంది అని సోషల్ మీడియాలో బాగా వెతకారు.

దీంతో ఆమె ప్రస్తుతం బుల్లితెర పై హోస్ట్ గా చేస్తుంది అని.నటనకు పూర్తిగా దూరంగా ఉందని తెలిసింది.ఇక తెలుగు ప్రేక్షకులు ఆమెను మరోసారి తెలుగు సినిమాలలో చూడాలని ఆశ పడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube