తెలంగాణలో దుకాణాదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.ఇకపై 24 గంటల పాటు షాప్స్ ను తెరిచి ఉంచేందుకు అనుమతిని ఇస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
అయితే సదరు సంస్థల్లో పని చేసే మహిళా ఉద్యోగులకు నైట్ డ్యూటీలు విధించే విషయంలో వారి అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు.అయితే కొన్ని సంస్థలకు కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది.
సిబ్బందికి గుర్తింపు కార్డులతో పాటు వీక్లీ ఆఫ్, ఓవర్ టైమ్ వేజెస్ ఉండాలని తెలిపారు.మహిళా ఉద్యోగులకు రాత్రి సమయంలో డ్యూటీ ఉంటూ రానుపోనూ రవాణా సదుపాయం కల్పించాలని సూచించారు.అదేవిధంగా 24 గంటల పాటు పని చేసే సంస్థలు రూ.10 వేలు వార్షిక రుసుం చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.







