రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు జబర్దస్త్ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రతి గురు శుక్రవారాలలో ప్రసారమవుతూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది.
కాగా ఈ జబర్దస్త్ షో( Jabardasth ) ఎంతో మంది కమెడియన్లకు లైఫ్ ఇచ్చింది అన్న సంగతి మనందరికీ తెలిసిందే.దాదాపుగా తెలుగులో పది సంవత్సరాలుగా ప్రసారం అవుతూ ఇప్పటికీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూనే ఉంది.
ఎప్పటికప్పుడు కొత్తకొత్త కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయం అవుతూనే ఉన్నారు.కామెడీతో పాటు అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు కూడా జరుగుతూ ఉంటాయి.

ఇటీవల కాలంలో సీరియస్గా గొడవ పడడం లాస్ట్ లో ప్రాంక్ అని చెప్పడం కామన్ అయిపోయింది.అయితే కొన్ని కొన్ని సార్లు కంటెస్టెంట్ లకు జడ్జిలకు మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి.గతంలో జడ్జిలు నాగబాబు రోజా కంటెస్టెంట్లపై ఫైర్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయని చెప్పవచ్చు.తాజాగా అటువంటి ఘటన చోటు చేసుకోవడంతో జడ్జ్ ఇంద్రజ స్టేట్ దిగి వెళ్లిపోయింది.
ఏప్రిల్ 13 న ప్రసారం కానున్న ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు.ఇక ఎపిసోడ్ ప్రోమో మొత్తం నవ్వుతూ నవ్విస్తూ ప్రేక్షకులను బాగానే ఎంటర్టైన్ చేశారు.

స్కిట్ మధ్యలో జబర్దస్త్ యాంకర్ సౌమ్యపై కూడా సెటైర్లు వేశారు.అంతా బాగానే ఉంది కానీ చివర్లో ఇంద్రజ( Indraja ) కోపంతో అరిచి అక్కడి నుంచి వెళ్లిపోయింది.తాగుబోతు రమేష్, వెంకీ టీమ్ కి మీద కాస్త అసంతృప్తి వ్యక్తం చేసింది.మార్కుల విషయంలో వెంకీ టీం కి తొమ్మిది మార్కులు ఇవ్వడంతో కంటెస్టెంట్లుగా మేము 100% చేశామని అనుకుంటున్నాము మరి ఎందుకు పది మార్కులు ఇవ్వలేదు మేడం అని ప్రశ్నించాడు.
పది మార్కులు ఇచ్చినప్పుడు ఎందుకు అని ప్రశ్నించారా అడగలేదు కదా మరి ఇప్పుడు ఎందుకు ప్రశ్నిస్తున్నారు అని కోపంగా అడిగింది.అప్పుడు ఇంద్రజ కోపంతో కృష్ణ భగవాన్( Krishna Bhagavaan ) కూడా తొమ్మిది మార్కులు ఇచ్చారు కదా మరి ఆయన్ని అడగకుండా నన్నే ఎందుకు అడుగుతున్నారు అని కోపంగా అరిచి అక్కడినుంచి వెళ్ళిపోతుంది.
ప్రస్తుతం అందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియా( Social media )లో వైరల్ అవుతోంది.ఇక ఆ ప్రోమోని చూసిన నెటజన్స్ ఇటువంటివి చాలా చూశాం లెండి అంత టిఆర్పి కోసం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అది నిజంగానే జరిగిందా లేకపోతే కేవలం టిఆర్పి కోసమా అన్నది తెలియాలి అంటే వేచి చూడాల్సిందే మరి.







