ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజుకుంది.ప్రధాని మోదీ పర్యటనకు సీఎం కేసీఆర్ దూరంగా ఉండనున్నారని తెలుస్తోంది.
మరోవైపు సింగరేణి ప్రైవేటీకరణలో కేంద్రం చర్యలకు వ్యతిరేకంగా కార్మికులు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో మోదీ పర్యటనపై తెలంగాణ వ్యాప్తంగా సింగరేణి కార్మికులతో కలిసి బీఆర్ఎస్ ఆందోళనలు చేస్తోంది.
‘మోదీ హటావో సింగరేణి బచావో’ అంటూ కార్మికులు నినాదాలు చేస్తున్నారు.







