ఇటీవలే కాలంలో యువతీ,యువకులు సరదాగా ఆన్లైన్లో పలు రకాల గేమ్స్ ఆడడం ప్రారంభించి చివరికి ఆ గేమ్స్ కు బానిసై లక్షల్లో డబ్బు పోగొట్టుకుంటున్నారు.ఈ ఆన్లైన్ గేమ్స్ ద్వారా చాలామంది ఆర్థికంగా నష్టపోయి చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు.
హైదరాబాదులో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఒక వ్యక్తి సరదాగా ఆన్లైన్ గేమ్ ఆడడం ప్రారంభించి, లక్షల్లో డబ్బులు పోగొట్టుకొని చివరికి ఆత్మహత్య చేసుకుని కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టాడు.

వివరాల్లోకెళితే ఆంధ్రప్రదేశ్లోని పొద్దుటూరుకు చెందిన శివ( Shiva ) హైదరాబాదులోని డీఏఈ డి 2/43 క్వార్టర్స్( DAE D 2/43 Quarters ) లో నివాసం ఉంటూ న్యూక్లియర్ ఫ్లుయేల్ కాంప్లెక్స్( Nuclear Fuel Complex ) (NFC) సంస్థలో వర్క్ అసిస్టెంట్ గా ఏడు సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు.శివకు మూడు సంవత్సరాల క్రితం జోగులాంబ గద్వాల కు చెందిన ప్రభాత తో వివాహం జరిగింది.వీరికి ఏడాదిన్నర వయసు ఉన్న వేదాన్ష్ సంతానం.
ఈనెల రెండవ తేదీన భార్య ప్రభాతకు పంటి నొప్పి కారణంగా.ట్రీట్మెంట్ కోసం జోగులాంబ గద్వాల లోని( Jogulamba Gadwala ) ఆమె పుట్టింటి దగ్గర వదిలి వచ్చాడు.
తరువాత రాత్రి ప్రభాత భర్తకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో సెక్యూరిటీ కి సమాచారం ఇచ్చింది.సెక్యూరిటీ ఇంటి తలుపులు పగలగొట్టి చూడగా శివ ఇంట్లోని ఫ్యానుకు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు.

పోలీసులకు సమాచారం అందించడంతో.సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటిని పరిశీలించక సూసైడ్ నోట్ లభించింది.ఆ సూసైడ్ నోట్ లో తన కొడుకు వేదాన్ష్ కోసం ఏమి చేయలేకపోతున్నానని, నా చావుకు నేనే కారణం నన్ను అందరూ క్షమించండి వేరే దారి లేక ఆత్మహత్య చేసుకుంటున్నాను అని శివ రాశాడని పోలీసులు తెలిపారు.అయితే శివకు ఆన్లైన్ లో గేమ్స్ ఆడే అలవాటు ఉందని, రూ.12 లక్షలు అప్పు చేస్తే అంత తామే తీర్చామని, శివ దగ్గర ఉండే స్మార్ట్ ఫోన్ తీసుకొని చిన్న ఫోన్ ఇచ్చిన కూడా శివ ఆన్లైన్ గేమ్స్ ఆడడం మానలేదని ప్రభాత తండ్రి మహంకాళి శ్రీనివాసులు కన్నీరు మున్నీరయ్యారు.







