బిచ్చగాడు వెంటపడుతున్నా పట్టించుకోని నటి... భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!

సాధారణంగా కొన్నిసార్లు సెలబ్రిటీలు తెలిసి తెలియక చేసే పనుల కారణంగా భారీగా ట్రోల్స్ ఎదుర్కొంటూ ఉంటారు.ఇలా ట్రోలింగ్ గురైనప్పుడు తప్ప వారు చేసిన పొరపాటున వారు గుర్తించలేరు.

 Actress Doesnt Care If A Beggar Is Chasing Her Netizens Are Trolling Heavily, Pr-TeluguStop.com

ఇలా ఎంతోమంది సెలబ్రిటీలు ట్రోలింగ్ కి గురైన విషయం మనకు తెలిసిందే.తాజాగా ఇలాంటి ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు నటి ప్రీతి జింటా(Preity Zinta).

ఈమె ఎయిర్ పోర్ట్ కు వెళ్లే హడావిడిలో పక్కనే భిక్షాటన చేస్తున్నటువంటి ఓ వ్యక్తి తనని బిక్షం అడుగుతున్న పట్టించుకోకుండా వెళ్లిపోయారు.దీంతో ఈమెను భారీగా ట్రోల్ చేస్తున్నారు.

బాలీవుడ్ ( Bollywood )ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రీతి జింటా ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణిస్తూనే మరోవైపు బిజినెస్ రంగంలోకి కూడా అడుగుపెట్టిన విషయం మనకు తెలిసిందే.ఇకపోతే ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ ఎలెవెన్( Punjab Kings XI in IPL ) జట్టుకు సహ యజమానిగా ప్రీతి వ్యవహరిస్తున్నారు.తాజాగా ఈమె ఎయిర్ పోర్ట్ కు చాలా హడావిడిగా బయలుదేరి వెళ్లారు.అయితే ఆ సమయంలో ఈమె కారు వద్దకు ఒక వికలాంగుడు వీల్ చైర్ సహాయంతో తన కారు వద్దకు వెళ్లి తనని డబ్బులు అడిగినప్పటికీ ఈ విషయాన్ని గమనించని ప్రీతి హడావిడిగా కారు ఎక్కి వెళ్ళిపోయింది.

ఇలా వికలాంగుడిని గమనించనటువంటి ప్రీతి కారులో వెళ్లిపోగా వికలాంగుడు కారు వెంట కొంత దూరం వెళ్లారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో చూసినటువంటి నేటిజన్స్ నటి ప్రీతి జింటా పై ట్రోల్స్ చేస్తున్నారు.ఏకంగా 100 కోట్లు పెట్టి ఐపీఎల్ జట్టు కొనుగోలు చేసే ప్రీతి జింటాకు కనీసం వికలాంగుడికి వంద రూపాయలు కూడా ఇవ్వలేవా అంటూ తనని ట్రోల్ చేస్తున్నారు.

బహుసా ఆమె గమనించి ఉండదు అంటూ మరికొందరు ఆమెకు మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube