హిందూపురంలో పర్యటించనున్న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ

శ్రీ సత్య సాయి జిల్లా చిలమత్తూరు మండలం కోడికొండ చెక్పోస్ట్ వద్ద సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఒకరోజు పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో పర్యటించనున్నారు.

 Mla Nandamuri Balakrishna Will Visit Hindupuram , Mla Nandamuri Balakrishna , Td-TeluguStop.com

ముందుగా తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు తెలుగుదేశం పార్టీ శ్రేణులతో భారీ కాన్వాయలతో బయలుదేరి వెళ్లారు.ఉమ్మడి అనంతపురం జిల్లా సింగనమలలో నిర్వహిస్తున్న యువగలం పాదయాత్రలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు సంఘీభావం తెలిపి తిరిగి హిందూపురం చేరుకొని లయోలా పాఠశాలలో ఏర్పాటుచేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించనున్నారు.

అనంతరం శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి పూలమాలలు వేసి నియోజకవర్గ స్థాయి టిడిపి నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు.ఆల్ హిలాల్ మసీద్ మైనార్టీ సోదరులకు ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పాల్గొంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube