ప్రస్తుతం దసరా సినిమా( Dasara ) బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుందనే చెప్పాలి.అయితే ఈ సినిమా విజయం వెనకాల డైరెక్టర్ అయిన శ్రీకాంత్ ఓదెల( Srikanth Odela ) కృషి చాలా నే ఉంది అందుకే అందరూ ఆయన గురించి గొప్ప గా చెప్పుకుంటున్నారు.
ఇక ఇది ఇలా ఉంటే ధరణిగాడు తెరమీద ఓ రేంజ్లో దుమ్ముదులుపుతున్నాడు.సినిమా విడుదలైన మొదటి ఐదు రోజుల్లోనే భారీ వసూళ్లను రాబడుతూ 100 కోట్ల మార్క్‌కు చేరువలో నిలిచింది.
దీంతో మూవీ టీమ్‌తో పాటు నిర్మాత ఫుల్ ఖుషీలో ఉన్నారు.

దసరా సినిమా హిట్ టాక్ తో పాటు , కాసుల వర్షం కురిపిస్తుండగానే నిర్మాత చెరుకూరి సుధాకర్( Cherukuri Sudhakar ) మామూలు హ్యాపీ కాదు.ఫుల్ హ్యాపీ.పడి పడి లేచె మనసు, విరాటపర్వం, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు తీసారు.
కానీ మంచి ఫలితం అందుకోలేకపోయారు.అయితే ఇండస్ట్రీట్లో ఇతనికి మంచి పేరుంది.
ఇక నిర్మాత మంచి వాడు .మంచి హిట్ రావాలి అని ఇండస్ట్రీలో అంతా అనుకున్నారు.బహుశా వాటి ఫలితమేమో దసరా సినిమా మంచి హిట్ అయింది.డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో బాగా వినిపిస్తోంది.స్టార్ డైరెక్టర్ సుకుమార్( Sukumar ) దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన శ్రీకాంత్ తొలి సినిమాతోనే తన సత్తా ఏంటో ఇండస్ట్రీకి చూపించాడు.ఇక తన బ్యానర్ కి ఫస్ట్ హిట్ ఇచ్చినందుకు గాను ప్రొడ్యూసర్ చేరుకూరు సుధాకర్ గారూ శ్రీకాంత్ ఓదెల కి బీఎండబ్ల్యూ కారు కూడా గిఫ్ట్ గా ఇచ్చినట్లు తెలుస్తుంది.

చాలా సంవత్సరాలు అసిస్టెంట్ డైరెక్టర్ గా కష్టపడి మొత్తానికి తను అనుకున్న డైరెక్టర్ అనే హోదాలో కూర్చుని హిట్ కొట్టిన శ్రీకాంత్ కి ఇది చాలా చిన్న గిఫ్ట్ అనే చెప్పాలి.ఆయన కష్టం ముందు ఇది చాలా తక్కువ.ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఆయన కి పెద్ద హీరోల నుంచి కూడా చాలా ఆఫర్స్ వస్తున్నట్టు తెలుస్తుంది.ప్రస్తుతం మహేష్ బాబు లాంటి హీరో తో కూడా ఒక సినిమా చేసే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తుంది ఇక దీనికి తోడు అఖిల్ అక్కినేని గారిని హీరోగా పెట్టీ ఒక సినిమా కూడా చేస్తాడు అనే టాక్ అయితే వినిపిస్తుంది…ప్రస్తుతం శ్రీకాంత్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా దసర సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు…








